పంజాబ్ పీసీసీ నవజోత్ సిద్ధూదే..

93
navajyoth

దిశ, వెబ్‌డెస్క్ : పంజాబ్ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడిగా నవజ్యోత సింగ్ సిద్ధూ కొనసాగుతాడని కాంగ్రెస్ అధిష్టానం శుక్రవారం స్పష్టం చేసింది. అయితే, ఇటీవల సిద్ధూ కాంగ్రెస్ పార్టీ పీసీసీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా తన రాజీనామాను సిద్ధూ ఉపసంహరించుకున్నాడని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ హరీవ్ రావత్ తెలిపారు. రాహుల్ గాంధీతో భేటీ అనంతరం సిద్ధూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలాఉండగా, పంజాబ్ మాజీ సీఎం అమరిందర్ సింగ్‌తో పాటు పార్టీలో తలెత్తిన అంతర్గత విభేదాల కారణంగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికీ రాజీనామా చేస్తున్నట్టు సిద్ధూ ప్రకటించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..