Health tips : అది పెరగట్లేదా..? అయితే ఇలా చేయండి!

by  |
Madhu
X

దిశ, వెబ్ డెస్క్: చాలామంది ఓ విషయంలో చాలా బాధపడుతుంటారు. ఆ ఒక్క సమస్య పరిష్కారం కాక తమలో తామే కుమిలిపోతుంటారు. అదేమంటే జ్ఞాపకశక్తి సమస్య. చాలా మంది ఈ సమస్యతో బాధపడుతుంటారు. వాళ్లు ఏం చేసినా అప్పటికప్పుడే మరిచిపోతుంటారు. మేం ఏం చేసినా గుర్తుండి చావట్లేదు.. ఈ సమస్యకు పరిష్కార మార్గమే లేదా?, ఈ సమస్యను ఎలా అధిగమించాలో అని వారు తమలో తామే కుమిలిపోతూ ఉంటారు. అయితే ఈ సమస్యతో బాధపడుతున్న వారు ఇలా చేస్తే చాలా ఈజీగా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.

Juse

అదేమంటే.. ప్రతిరోజూ ఉదయం కాలిఫ్లవర్, క్యారెట్, కొత్తిమీరను మిక్స్ చేసి ఉడికించాలి. ఆ తర్వాత దానిలో నిమ్మరసం, మిరియాలపొడి, ఉప్పును కలపాలి. అలా కలిపిన మిశ్రమాన్ని తినడం వల్ల మెదడు పనితీరు పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అదేవిధంగా ఆకుకూరలు, బీన్స్ తోపాటు టమాటాలను విరివివిగా తీసుకోవాలి. అలాగే ప్రతిరోజూ నట్స్, గుడ్డు, పెరుగు, పాలపదార్థాలు తీసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే మీ జ్ఞాపకశక్తి పెరిగే అవకాశముంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఇలా చేసి మీ మతిమరుపు సమస్య నుంచి బయటపడండి.


Next Story

Most Viewed