జగన్ సర్కార్‌పై హీరో నాని అసహనం.. నిర్మాత నట్టికుమార్ కౌంటర్ 

by srinivas |
natti kumar
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపుపై హీరో నాని చేసిన వ్యాఖ్యలకు టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నాని వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ మండిపడ్డారు. టికెట్ రేట్లు, వసూళ్లు, షేర్ వంటి విషయాలపై కనీస అవగాహన లేని నాని ఏం తెలుసునని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. టికెట్ ధరల విషయంపై తాము ఏపీ ప్రభుత్వం తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.

అంతేకాదు టికెట్ల తగ్గింపు వ్యవహారం కూడా కోర్టులో నడుస్తుందని ఇలాంటి తరుణంలో హీరో నాని వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. నాని వ్యాఖ్యలు ఒక్క సినిమాతో పోయేది కాదని రాబోయే సినిమాలపైనా తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు. ఏపీ ప్రభుత్వంపై నాని చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలంటూ నిర్మాత నట్టికుమార్ డిమాండ్ చేశారు. ఇకపోతే న్యాచురల్ స్టార్ నాని గురువారం ఉదయం ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలు తగ్గింపుపై అసహనం వ్యక్తం చేశారు. సినిమా థియేటర్ల కంటే కిరాణా షాపుల కలెక్షన్లే బాగున్నాయని, టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వ నిర్ణయం సముచితం కాదని నాని విమర్శించిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed