Zubeen: జుబీన్ గార్గ్ మృతి కేసులో ట్విస్ట్.. ఆయన మేనేజర్‌పై లుకౌట్ నోటీసులు

by B.Srinivas |

అసోం సింగర్ జుబీన్ గార్గ్ సింగపూర్‌లో స్కూబా డ్రైవింగ్ చేస్తూ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే.

Zubeen: జుబీన్ గార్గ్ మృతి కేసులో ట్విస్ట్.. ఆయన మేనేజర్‌పై లుకౌట్ నోటీసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: అసోం సింగర్ జుబీన్ గార్గ్ (Jubeen garg) సింగపూర్‌లో స్కూబా డ్రైవింగ్ చేస్తూ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై దర్యాప్తు చేస్తున్న అసోం ప్రభుత్వం ప్రస్తుతం పరారీలో ఉన్న జుబీన్ గార్గ్ మేనేజర్ సిద్ధార్థ్ శర్మ, నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ నిర్వాహకుడు శ్యామ్‌కాను మహంతలపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని సీఎం హిమంత బిస్వ శర్మ శనివారం వెల్లడించారు. వారి బ్యాంకు ఖాతాలు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులను కూడా స్తంభింపజేసినట్లు తెలిపారు. అక్టోబర్ 6 లోపు వారిద్దరూ అసోం సీఐడీ ఎదుట హాజరు కావాలని, దర్యాప్తు బృందం ఎదుట తమ వాంగ్మూలాలను నమోదు చేయాలని సూచించారు.

జుబీన్ గార్గ్ ఆకస్మిక మరణం విషయంలో ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఇది జుబీన్ అసోం, దీనిని నేపాల్‌గా మార్చడానికి అనుమతించబోమని స్పష్టం చేశారు. ప్రజలు జుబీన్‌కు న్యాయం కోరుకుంటున్నారని, దానిని తాము అర్థం చేసుకున్నామని తెలిపారు. కాగా, జుబీన్ గార్గ్ మరణానికి దారితీసిన పరిస్థితులపై పలువురు సందేహాలు లేవనెత్తారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే జుబీన్ మరణంపై దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.

Next Story