- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘లాంగ్ డిస్టెన్స్ సర్వీస్ చార్జి’తో కస్టమర్లకు షాకిచ్చిన జొమాటో
‘లాంగ్ డిస్టెన్స్ సర్వీస్ చార్జి’తో కస్టమర్లకు జొమాటో షాకిచ్చింది. 4 కిమీల కన్నా దూరంలో ఉన్న రెస్టారెంట్ల నుంచి ఆర్డర్ ఇస్తే ఈ చార్జి వేస్తోంది.

దిశ, నేషనల్ బ్యూరో: కస్టమర్లకు ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డరింగ్ ప్రాట్‌ఫాం జొమాటో షాకిచ్చింది. ఇక నుంచి 4 కిలోమీటర్ల కన్నా దూరంలో ఉండే రెస్టారెంట్ల నుంచి ఫుడ్ ఆర్డర్ చేసే కస్టమర్లపై ‘లాంగ్ డిస్టెన్స్ సర్వీస్ ఫీజు’ విధించనున్నట్లు ప్రకటించింది. ఈ విధానం ప్రకారం 4 నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెస్టారెంట్ల నుంచి ఆర్డర్ చేస్తే రూ.15 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఈ ఆర్డర్ల విలువ కూడా రూ.150పైన ఉండాలి. ఇక 6 కిలోమీటర్ల కన్నా దూరం ఉన్న రెస్టారెంట్ల నుంచి ఫుడ్ ఆర్డర్ ఇస్తే ఆర్డర్ వాల్యూతో సంబంధం లేకుండా రూ.25 నుంచి రూ.35 స్వీస్ ఫీజు విధించనున్నారు. అయితే దీని వల్ల జొమాటోకు చెల్లించే కమీషన్ పెరుగుతుందని కొన్ని రెస్టారెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అయితే ఈ లాంగ్ డిస్టెన్స్ సర్వీస్ ఫీజు కలుపుకొని కమీషన్ 30 శాతం మించదని జొమాటో హామీ ఇస్తోంది. కానీ ఇతర ఖర్చులతో కలుపుకొని ఈ కమీషన్ 45 శాతానికి చేరుకుంటుందని రెస్టారెంట్ యజమానులు చెప్తున్నారు. సమీప దూరంలో ఉన్న కస్టమర్లు ఇచ్చిన రేటింగ్స్‌ను బట్టి ఈ సర్వీస్ ఫీజు నిర్ణయం తీసుకున్నట్లు జొమాటో వర్గాలు చెప్తున్నాయి. కస్టమర్లు తమకు దగ్గరలోని రెస్టారెంట్ల నుంచి ఆర్డర్లు ఇచ్చేలా ప్రోత్సహించేందుకే ఈ ఫీజును ప్రతిపాదించినట్లు సమాచారం.






