- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Zelensky: విద్యుత్ గ్రిడ్‌లపై రష్యా దాడులు చేస్తూనే ఉంది.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ
రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌లు సుమారు రెండు గంటల పాటు ఫోన్ కాల్‌లో సంభాషించిన విషయం తెలిసిందే.

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), రష్యా ప్రెసిడెంట్ పుతిన్ (Putin)లు సుమారు రెండు గంటల పాటు ఫోన్ కాల్‌లో సంభాషించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 30 రోజుల పాటు విద్యుత్ గ్రిడ్‌లు, మౌలిక సదుపాయాలపై దాడులు ఆపివేసేందుకు పుతిన్ అంగీకరించారు. అయితే ట్రంపుతో సంభాషించిన అనంతరం కూడా రష్యా తమపై దాడులకు పాల్పడుతూనే ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelensky) తెలిపారు. ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు కొనసాగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దాడులు నిలిపివేయాలని పుతిన్ అంగీకరించిన కాసేపటికే తమపై అటాక్ చేశారని నొక్కి చెప్పారు. ఓ ఆస్పత్రిపై సైతం రష్యా డ్రోన్ దాడి చేయగా భవనం తీవ్రంగా దెబ్బతిన్నట్టు వెల్లడించారు. దాడులు ఆపడానికి మాస్కో నిరాకరించిందని కాబట్టి యుద్ధాన్ని పొడిగించకుండా ఆపడానికి పుతిన్‌పై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. యుద్ధాన్ని ఆపడానికి రష్యా సిద్ధంగా లేదని మరోసారి రుజువైందన్నారు.
ట్రంప్ పుతిన్‌లు ఫోన్ సంభాషణను ముగించిన కొద్దిసేపటికే కీవ్‌లో వైమానిక దాడి సైరన్‌లు వినిపించాయని, ఆ తర్వాత నివాసితులు ఆశ్రయం పొందుతుండగా పేలుళ్లు సంభవించాయని ఉక్రెయిన్ ఆరోపించింది. దాడిని తిప్పికొట్టడానికి ప్రయత్నాలు జరిగినప్పటికీ, సుమీలోని ఒక ఆస్పత్రిపై ప్రత్యక్ష డ్రోన్ దాడి, డోనెట్స్క్ ప్రాంతంలోని నగరాల్లోని మౌలిక సదుపాయాలపై దాడులు జరిగాయని తెలిపింది. కీవ్‌తో పాటు జైటోమిర్, సుమీ, చెర్నిహివ్, పోల్టావా, ఖార్కివ్ ప్రాంతాల్లోనూ రష్యా డ్రోన్లు కనిపించినట్టు జెలెన్ స్కీ తెలిపారు. 2014లో రష్యాలో విలీనమైన క్రిమియన్ ద్వీపకల్పం సరిహద్దులో ఉన్న క్రాస్నోడార్ ప్రాంతంలోని అధికారులు, అక్కడ జరిగిన డ్రోన్ దాడి కారణంగా చమురు డిపోలో మంటలు చెలరేగాయని వెల్లడించారు.






