Zelensky: పుతిన్ త్వరలోనే చనిపోతాడు.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు

by B.Srinivas |

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యం క్షీణిస్తోందని పలు కథనాలు వెలువడుతున్న వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Zelensky: పుతిన్ త్వరలోనే చనిపోతాడు.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ఆరోగ్యం క్షీణిస్తోందని పలు కథనాలు వెలువడుతున్న వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelensky) సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ త్వరలోనే చనిపోతాడని, ఆయన మరణానంతరం తమ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఆగిపోతుందని వ్యాఖ్యానించారు. పారిస్ పర్యటనలో ఉన్న ఆయన యూరోపియన్ జర్నలిస్టులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. పుతిన్ తుది శ్వాస వరకు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఆయన ఆశయాలు కేవలం ఉక్రెయిన్‌కు మాత్రమే పరిమితం కాలేదని, పాశ్చాత్య దేశాలతో ప్రత్యక్ష ఘర్షణకు కూడా దారి తీశామని ఆరోపించారు. పుతిన్‌పై ఒత్తిడి తీసుకురావడంలో అమెరికా, యూరప్‌లు సంయుక్తంగా ఉండాలని కోరారు.

పుతిన్ యూరోపియన్, అమెరికన్ కూటమికి భయపడుతున్నారని, అందుకే దానికి విచ్ఛిన్నం చేయాలని కోరుకుంటున్నారన్నారు. ఇప్పటి వరకు యుద్ధంలో అమెరికా చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఉక్రెయిన్ రష్యాల మధ్య కాల్పుల విరమణకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. పలు సార్లు చర్చల అనంతరం ఇటీవలే నల్ల సముద్రం, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు ఆపడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ అగ్రిమెంట్ జరిగిన మరుసటి రోజే పుతిన్ ఈ వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

Next Story