- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Zelensky: ఆ దేశాలపై టారిఫ్‌లు వేయడం సరైందే.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ
రష్యాతో వాణిజ్యం కొనసాగించే దేశాలపై సుంకాలు విధించడం సరైందేనని, ఇది మంచి ఆలోచన అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు.

దిశ, నేషనల్ బ్యూరో: రష్యాతో వాణిజ్యం కొనసాగించే దేశాలపై సుంకాలు విధించడం సరైందేనని, ఇది మంచి ఆలోచన అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelensky) తెలిపారు. రష్యా దురాక్రమణను ఆపడానికి మరిన్ని కఠిన చర్యలు అవసరమని నొక్కి చెప్పారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. భారత్‌పై సుంకాలు విధించాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రణాళికలపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. రష్యాతో ఒప్పందాలు కొనసాగించే దేశాలపై సుంకాలు విధించడం సరైన ఆలోచన అని, యుద్ధ ప్రయత్నాలకు మద్దతిచ్చే దేశాలపై ఆర్థిక ఆంక్షలు విస్తరించాలన్నారు. మాస్కో ఆర్థికంగా నష్టాన్ని చవి చూడాలని అప్పుడు మాత్రమే నిజమైన ఫలితాలు వెల్లడవుతాయని చెప్పారు.
పుతిన్‌పై ఒత్తిడి తీసుకురావడం ఎంతో అవసరమని, ఈ విషయంలో ట్రంప్ (Trump) సరిగ్గానే వ్యవహరిస్తున్నారన్నారు. యుద్ధాన్ని పరిష్కరించాలంటే రష్యాతో అన్ని రకాల డీల్స్ ఆపేయాలని, మరిన్ని ఆంక్షలు విధించాలని తెలిపారు. యుద్ధ విరమణకు రష్యా అధ్యక్షుడు పుతిన్ నిజాయితీగా సంప్రదింపుల్లో పాల్గొనడం లేదని ఆరోపించారు. కాగా, రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య సంధికి భారత్ ప్రయత్నిస్తున్న తరుణంలో జెలెన్ స్కీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.






