- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Yunus: భారత్‌తో మంచి సంబంధాలు కోరుకుంటున్నాం.. మహమ్మద్ యూనస్
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ యూనస్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ యూనస్ (Mohammad yunus) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ భారత్‌తో మంచి సంబంధాలను కోరుకుంటుందని, కానీ ఎల్లప్పుడూ ఏదో ఒక తప్పు జరుగుతుందని తెలిపారు. పొరుగు దేశంతో మాకు ఎలాంటి సమస్యలూ ఉండొద్దని ఆశిస్తున్నట్టు వెల్లడించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారు. భారత్ మా పొరుగు దేశం కాబట్టి ఆ దేశంతో ఉత్తమ సంబంధాలను కలిగి ఉండాలనుకుంటున్నట్టు తెలిపారు. కానీ భారత మీడియా నుంచి వచ్చే నకిలీ వార్తల వల్ల ప్రతిసారీ ఏదో విషయం వల్ల తప్పు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్‌లో కోపం, అశాంతి కలిగించేది నకిలీ వార్తలేనని స్పష్టం చేశారు. దీనిని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
మాజీ ప్రధాని షేక్ హసీనా అప్పగింత అంశంపై స్పందిస్తూ.. ఈ ప్రక్రియ కొనసాగుతుందని, కానీ ఇది పూర్తిగా చట్టబద్ధంగా, న్యాయంగా జరిగేలా చూస్తామన్నారు. తాను ప్రధాని మోడీతో సంభాషించానని, షేక్ హసీనా భారత్ నుంచి రాజకీయ ప్రకటనలు చేయకుండా నిరోధించాలని ఆయనను అభ్యర్థించానని తెలిపారు. అయితే సోషల్ మీడియాను నియంత్రించలేమని మోడీ తనతో చెప్పారన్నారు. కాగా, బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేతగా యూనస్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే.






