యూట్యూబర్ వద్ద 150 పాకిస్తానీ నెంబర్లు.. పోలీసు కస్టడీ గడువు పొడిగించిన కోర్టు

by Phanindra |

గూఢచర్యం కేసులో అరెస్టయిన యూట్యూబర్ వద్ద 150 పాకిస్తానీ నెంబర్లున్నట్లు పోలీసులు తెలిపారు. మరో రెండ్రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది.

యూట్యూబర్ వద్ద 150 పాకిస్తానీ నెంబర్లు.. పోలీసు కస్టడీ గడువు పొడిగించిన కోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్‌కు గూఢచర్యం చేస్తున్న ఆరోపణల్తో అరెస్టయిన యూట్యూబర్ జస్బీర్ సింగ్‌ పోలీస్ కస్టడీని మరో రెండ్రోజులు పొడిగిస్తున్నట్లు పంజాబ్‌లోని మొహాలీ కోర్టు ప్రకటించింది. ఇలాంటి కేసులోనే అరెస్టయిన జ్యోతి మల్హోత్రతో కూడా జస్బీర్‌కు మంచి రిలేషన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జస్బీర్ కూడా పలుమార్లు పాకిస్తాన్ వెళ్లొచ్చాడని, అతని వద్ద 150 వరకు పాకిస్తానీల నెంబర్లు ఉన్నాయని పోలీసులు ఆరోపించారు.


దీనిపై విచారణకు వారం రోజుల కస్టడీ కోరగా.. కోర్టు కేవలం మూడ్రోజులే అనుమతిచ్చింది. ఈ గడువు తీరడంతో కస్టడీ పొడిగించాలని పోలీసులు కోరడంతో.. అతన్ని మరో రెండ్రోజుల పోలీసు కస్టడీకి పంపాలని కోర్టు నిర్ణయించింది. ‘జాన్ మహల్’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడిపే జస్బీర్‌ కూడా జ్యోతి మల్హోత్రాలాగే ఢిల్లీలోని పాక్ ఎంబసీలో పనిచేసిన ఐఎస్ఐ హ్యాండ్లర్ డానిష్ అలియాస్ ఎహసాన్-ఉర్-రెహ్మాన్‌తో టచ్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story