- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారణాసిలో గంగానదిపై డీజేలు, బీరుతో యువకుల పార్టీ.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు
ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం వారణాసిలో పవిత్ర గంగానదిపై కొందరు యువకులు పడవలో మద్యం సేవిస్తూ, డీజే సౌండ్‌కు డ్యాన్సులు చేసిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం వారణాసిలో పవిత్ర గంగానదిపై కొందరు యువకులు పడవలో మద్యం సేవిస్తూ, డీజే సౌండ్‌కు డ్యాన్సులు చేసిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైరల్ వీడియో ప్రకారం.. రెండు పడవలపై ఉన్న కొందరు యువకులు భారీ డీజే సౌండ్‌తో డ్యాన్సులు చేస్తూ, బీర్లు తాగుతూ గంగానదిలో పార్టీ చేసుకున్నారు. గంగానది పవిత్రతను కలుషితం చేస్తున్నారని, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు మండిపడుతున్నారు. పడవలపై సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెంచాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
పోలీసుల దర్యాప్తు..
ఈ ఘటనపై వారణాసి పోలీసులు వెంటనే స్పందించారు. మాంఝీ సామాజిక వర్గం నిర్వహించిన ఓ మతపరమైన పడవ ఊరేగింపు సమయంలో ఈ వీడియో రికార్డయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. వీడియో ఆధారంగా నిందితులను గుర్తించి తగిన చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు స్పష్టం చేశారు.






