- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రైన్‌లో పొట్టుపొట్టు కొట్టుకున్న యువకులు.. కారణం ఏంటంటే?
సాధారణంగా రద్దీ పరిస్థితుల్లో రైళ్లు, బస్సులలో ప్రయాణాలు చేస్తున్నప్పుడు సీటు దొరకడం చాలా కష్టంగా ఉంటుంది.

దిశ,వెబ్‌డెస్క్: సాధారణంగా రద్దీ పరిస్థితుల్లో రైళ్లు, బస్సులలో ప్రయాణాలు చేస్తున్నప్పుడు సీటు దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. ఇక, సీటు కోసం నానా తంటాలు పడుతుంటారు. ఈ క్రమంలో సీటు దొరకకపోతే కొందరు వేరే వాహనంలో వెళ్లిపోదాం అనుకొని దిగిపోతారు. మరికొందరు నిలబడి అయిన ప్రయాణిస్తారు. కానీ బీహర్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
బీహార్‌లోని సమస్తిపూర్ రైల్వే డివిజన్ పరిధిలో నడుస్తున్న రక్సౌల్-ఆనంద్ విహార్ సత్యాగ్రహ ఎక్స్‌ప్రెస్‌లో సీటు కోసం ప్రయాణికుల మధ్య గొడవ జరిగింది. జనరల్ బోగీలో సీటు విషయంలో మొదలైన గొడవ కొట్టుకునే వరకు తీసుకొచ్చింది. ఆ సీటు తనదే అని ఓ యువకుడు చెప్పాగా, కోపోద్రిక్తులైన ముగ్గురు యువకులు అతడిని తీవ్రంగా కొట్టారు. అతన్ని కాలితో తన్ని, పిడిగుద్దులు కురిపించారు. ఈ సంఘటన సమయంలో ఇతర ప్రయాణికులు చూస్తున్నారే తప్ప ఎవరు గొడవను ఆపడానికి ప్రయత్నించలేదు.
ఈ మొత్తం సంఘటనను ఒక ప్రయాణీకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. అయితే, ఈ సంఘటన జరిగిన సమయంలో ఏ RPF లేదా GRP జవాన్ సంఘటనా స్థలంలో లేరు. దీంతో ప్రయాణీకుల భద్రతకు సంబంధించి రైల్వే ఏర్పాట్లపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఘటనకు సంబంధించిన వీడియో పై స్పందించిన రైల్వే యంత్రాంగం ఈ విషయంపై దర్యాప్తునకు ఆదేశించింది.






