Indian passport: ఇండియన్ పాస్ పోర్ట్ ఉంటే చాలు.. టర్కీ, అజర్ బైజాన్ లను తలదన్నే ప్రకృతి అందాలను ఈ 5 దేశాల్లో చూసేయొచ్చు

by Vennela |

Indian passport: ప్రస్తుతం టర్కీ, అజర్ బైజాన్ వంటి పాకిస్తాన్ మిత్ర దేశాలకు భారతీయ టూరిస్టులు పర్యటించేందుకు ఇష్టం చూపించడం లేదు.

Indian passport: ఇండియన్ పాస్ పోర్ట్ ఉంటే చాలు.. టర్కీ, అజర్ బైజాన్ లను తలదన్నే ప్రకృతి అందాలను ఈ 5 దేశాల్లో చూసేయొచ్చు
X

దిశ, వెబ్ డెస్క్: Indian passport: ప్రస్తుతం టర్కీ, అజర్ బైజాన్ వంటి పాకిస్తాన్ మిత్ర దేశాలకు భారతీయ టూరిస్టులు పర్యటించేందుకు ఇష్టం చూపించడం లేదు. దీనికి ప్రధాన కారణం పాకిస్థాన్ కు అనుకూలంగా టర్కీ అదేవిధంగా అజర్ బైజాన్ దేశాలు నిర్ణయం తీసుకోవడమే కారణమని చెప్పవచ్చు. బాయ్ కాట్ టర్కీ నినాదం కూడా దీనికి ప్రేరణగా నిలిచింది అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కేవలం ఇండియన్ పాస్ పోర్ట్ ఉంటే చాలు దాదాపు 50 కు పైగా దేశాలను నామమాత్రపు వీసాతో పర్యటించే అవకాశం ఉంది. అందులో ఇప్పుడు ఒక ఐదు దేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇది మీరు టర్కీ, అజర్ బైజాన్ లకు ప్రత్యామ్నాయంగా పర్యటించవచ్చు. వీటిలో ముఖ్యంగా, థాయిలాండ్, కంబోడియా, ఇండోనేషియా, సీషెల్స్, జార్జియా వంటి దేశాలు ప్రధానమైనవి. ఈ దేశాలు ప్రకృతి రమణీయతకు, అలాగే సాంస్కృతిక వైవిధ్యానికి మారు పేరు అని చెప్పవచ్చు.

థాయిలాండ్ : థాయిలాండ్ అంటేనే పర్యటకులకు స్వర్గధామం అని చెప్పవచ్చు ఇక్కడ బీచ్ లు ప్రపంచ ప్రసిద్ధి చెందినవి. బ్యాంకాక్, పట్టయా వంటి ఆధునిక నగరాలతో పాటు, అనేక బౌద్ధ సాంస్కృతిక కేంద్రాలు ఉన్నాయి. ఈ దేశం విజిట్ చేయడానికి ప్రత్యేకంగా వీసా అవసరం లేదు ఇండియన్ పాస్ పోర్ట్ ఉంటే చాలు.

కంబోడియా : తూర్పు ఆసియా దేశాలకు చెందిన మరో ప్రసిద్ధ దేశం కంబోడియా బౌద్ధ ధర్మానికి కంబోడియా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఆంగ్ కోర్ వాట్ నెలకొని ఉంది. భారతీయ సంస్కృతి తూర్పు ఆసియాలో విస్తరించింది అనడానికి ఇక్కడి చారిత్రక ఆనవాళ్లు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే ప్రకృతి రమణీయతకు కంబోడియా ఎంతో పెట్టింది పేరుగా చెప్పవచ్చు.

ఇండోనేషియా : తూర్పు ఆసియా దేశాల్లో మరో ముఖ్యమైన దేశం ఇండోనేషియా. సముద్ర ద్వీపాల సమూహంగా ఉన్న ఇండోనేషియాలో బాలి, సుమత్రా, జావా లాంటి అనేక దర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో అత్యంత స్వచ్ఛమైన సముద్ర తీరాలు కలిగి ఉన్న ఇక్కడి బీచ్ లు ఎంతో ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు అని చెప్పవచ్చు.

సీషెల్స్ : హిందూ మహాసముద్రంలో ఉన్న సిషెల్స్ దేశం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ద్వీప సమూహం సముద్రపు అందాలను చూసేందుకు ఎంతో అనువైనవి అని చెప్పవచ్చు.

జార్జియా : స్విట్జర్లాండ్ తలదన్నే అందాలను కేవలం ఇండియన్ పాస్పోర్ట్ ద్వారా చూడాలి అనుకున్నట్లయితే జార్జియా ఒక చక్కటి ఆప్షన్ అని చెప్పవచ్చు. యూరప్ ఖండంలోని ఈ దేశం ప్రకృతి రమణీయతకు ఎంతో పెట్టింది పేరుగా చెప్పవచ్చు. ఇక్కడికి వెళ్లాలంటే ముందుగా ఆన్లైన్ ద్వారా ఈ వీసా అప్లై చేసుకుంటే సరిపోతుంది.

Next Story