- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Yemen: యెమన్‌లో ఇజ్రాయెల్ దాడులు.. విద్యుత్ ప్లాంట్, గ్యాస్ స్టేషన్ ధ్వంసం
ఇజ్రాయెల్ రాజధాని సనాపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. హౌతీ తిరుగుబాటుదారులే లక్ష్యంగా అటాక్ చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: యెమన్ రాజధాని సనాపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. హౌతీ తిరుగుబాటుదారులే లక్ష్యంగా అటాక్ చేసింది. సనాలోని కీలక ఇంధన కేంద్రాలపై ఇజ్రాయెల్ దళాలు దాడులు చేయగా ఒక విద్యుత్ ప్లాంట్, గ్యాస్ స్టేషన్ ధ్వంసమైనట్టు హౌతీ మీడియా కార్యాలయం తెలిపింది. అధ్యక్ష భవనం దగ్గర కూడా పేలుళ్లు జరిగినట్టు పేర్కొంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ఈ దాడులను ధ్రువీకరించింది. హౌతీ మిలిటెంట్ల మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు చేసినట్టు తెలిపింది. ఇజ్రాయెల్, దాని మిత్ర దేశాలకు హాని కలిగించడానికి హౌతీలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. కొన్ని రోజుల క్రితం హౌతీలు ఇజ్రాయెల్ వైపు క్లస్టర్ బాంబులను ప్రయోగించారు. ఈ క్రమంలోనే దానికి ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంది. కాగా, గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పాలస్తీనియన్లకు మద్దతుగా హౌతీలు పోరాడుతున్నారు. ఇజ్రాయెల్ వైపు డ్రోన్లు, క్షిపణులను ప్రయోగిస్తున్నారు. ఎర్ర సముద్రంలో ఓడలపైనా దాడులకు పాల్పడ్డారు.






