- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో భారీ వర్షాలు.. రాకపోకలకు అంతరాయం, 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఏపీ, తెలంగాణ సహా తమిళనాడును అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మండుటెండల్లో కురుస్తున్న వర్షాలు కాస్త ఉపశమనాన్నిచ్చినా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ, తెలంగాణ సహా తమిళనాడును అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మండుటెండల్లో కురుస్తున్న వర్షాలు కాస్త ఉపశమనాన్నిచ్చినా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. కష్టపడి పండించిన పంటంతా వర్షార్పణం అవ్వడం రైతన్నలు దిగులు చెందుతున్నారు. తమిళనాడులోని ఉమ్మడి వేలూరు జిల్లాలో కురిసిన కుండపోత వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. ప్రభుత్వ ఆస్పత్రిలోకి వర్షపు నీరు చేరడంతో పేషెంట్లు ఇబ్బంది పడ్డారు.
కృష్ణగిరి, తిరుపత్తూర్, ధర్మపురి, సాలెం, కల్లకురిచి, నమక్కల్, తిరుచిరాపల్లి, పెరంబలూర్, అరియలూర్, పుదుక్కొట్టై, తంజావూరు, తిరువరూర్, మయిలాదుతురై, నాగపట్నం జిల్లాలతో పాటు కరైకల్ కు చెన్నై వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. చెన్నైలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. వర్షాలు కురిసే సమయంలో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 2-4 డిగ్రీల వరకూ తక్కువగా నమోదవుతాయని తెలిపింది.






