నా భర్తను పాకిస్థాన్ విడిపించాలి.. ఉగ్రవాది భార్య రిక్వెస్ట్

by Ajay Maddhiboyina |

భారత్ జైలులో ఉన్న తన భర్తను పాకిస్థాన్ విడిపించాలని ఉగ్రవాది యాసిన్ మాలిక్ భార్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పాకిస్థాన్ అదుపులో ఉన్న బీఎస్ఎఫ్ సైనికుడిని విడుదల చేసి తన భర్తను కూడా భారత్ జైలు నుండి విడిపించాలని డిమాండ్ చేసింది.

నా భర్తను పాకిస్థాన్ విడిపించాలి.. ఉగ్రవాది భార్య రిక్వెస్ట్
X

దిశ‌, వెబ్ డెస్క్: భారత్ జైలులో ఉన్న తన భర్తను పాకిస్థాన్ విడిపించాలని ఉగ్రవాది యాసిన్ మాలిక్ భార్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పాకిస్థాన్ అదుపులో ఉన్న బీఎస్ఎఫ్ సైనికుడిని విడుదల చేసి తన భర్తను కూడా భారత్ జైలు నుండి విడిపించాలని డిమాండ్ చేసింది. యాసిన్ ను ఉరి తీస్తారేమో అనే భయం తనకు ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే దీనిపై స్పందించిన అధికారులు పాకిస్థాన్ జైలులో ఉన్న బీఎస్ఎఫ్ అధికారిని నిబంధనల ప్రకారం విడుదల చేయాల్సిందేనని స్పష్టం చేసింది.

అలాగే ఉగ్రవాదిని విడిపించాలని అడిగే హక్కు పాకిస్థాన్‌కు లేదని చెప్పింది. ఇదిలా ఉంటే కశ్మీరీ ఉగ్రవాది యాసిన్ మాలిక్ ఉగ్రవాదానికి నిధులు మళ్లించిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. నలుగురు ఐఏఎఫ్ సిబ్బంది హత్య కేసులోనూ యాసిన్ దోషిగా ఉన్నాడు. జేకేఎల్ఎఫ్ అనే ఉగ్రవాద సంస్థకు చీఫ్ గా వ్యవహరించాడు. యాసిన్ కు ఐఎస్ఐతోనూ సంబంధాలు ఉన్నాయి. అనేక కేసుల్లో జైలులో ఉన్న యాసిన్ కు ఢిల్లీ హైకోర్టు జీవిత ఖైదు విధించింది. కాగా ఇలాంటి కరుడు గట్టిన ఉగ్రవాదులకు మరణశిక్ష విధించాలనే డిమాండ్లు వస్తున్నాయి.

Next Story