Kumbh Mela: మహా కుంభమేళాలో WWE ఫైటర్.. ది గ్రేట్ కాళీ.. ఎగబడిన జనం!

by Ramesh Naini |   (  Updated:2025-01-31 13:03:31  IST  )

త్రివేణీ సంగమంలో స్నానాలు చేసేందుకు సాధారణ భక్తులు, రాజకీయ నేతలతో పాటు ప్రపంచ నలుమూలల నుంచి ప్రముఖులు తరలివస్తున్నారు.

Kumbh Mela: మహా కుంభమేళాలో WWE ఫైటర్.. ది గ్రేట్ కాళీ.. ఎగబడిన జనం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. త్రివేణీ సంగమంలో స్నానాలు చేసేందుకు సాధారణ భక్తులు, రాజకీయ నేతలతో పాటు ప్రపంచ నలుమూలల నుంచి ప్రముఖులు తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించి గంగాపూజ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్‌కు చెందిన WWE స్టార్ ఫైటర్ 'ది గ్రేట్ కాళీ' (The Great Khali) ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో పాల్గొన్నారు. అక్కడ అతను త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానం చేశారు. తన తోటి భక్తులతో కలిసి పుణ్య స్నానం ఆచరించారు. ది గ్రేట్ కాళీ త్రివేణి సంగమం వద్ద తన పవిత్ర స్నానం చేస్తున్నప్పుడు సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు పోటీపడ్డారు.

అయిన కూడా ది గ్రేట్ కాళీ అసహనానికి లోనవకుండా వారితో సెల్ఫీలు దిగే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ది గ్రేట్ కాళీ తాాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా స్నానం చేసిన వీడియోను పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. మరోవైపు ఆయన కుంభమేళాపై మీడియాతో మాట్లాడారు. తను కుంభమేళాకు రావడం మొదటి సారి అని, మతపరమైన కార్యక్రమంలో అందించిన అద్భుతమైన సౌకర్యాలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.

Next Story