పాకిస్థాన్ కంటే నరకం బెటర్..ప్రముఖ రచయిత జావేద్ అక్తర్

by Ajay Maddhiboyina |

పాకిస్థాన్ కంటే నరకానికి వెళ్లడం బెటర్ అని ప్రముఖ రచయిత జావెద్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉన్నది ఉన్నట్టు చెప్పే తాను వ్యతిరేఖత ఎదురుకొంటున్నట్టు తెలిపారు.

పాకిస్థాన్ కంటే నరకం బెటర్..ప్రముఖ రచయిత జావేద్ అక్తర్
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్ కంటే నరకానికి వెళ్లడం బెటర్ అని ప్రముఖ రచయిత జావెద్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉన్నది ఉన్నట్టు చెప్పే తాను వ్యతిరేఖత ఎదురుకొంటున్నట్టు తెలిపారు. నేను నాస్తికుడిని కొంద‌రు న‌రకానికి వెళ‌తాన‌ని అంటున్నారు, కొంద‌రు జీహాది కాబ‌ట్టి పాకిస్థాన్ వెళ్లాల‌ని అంటున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. న‌ర‌క‌మా? పాకిస్థానా? అంటే న‌ర‌కాన్నే ఎంచుకుంటాన‌ని స్ప‌ష్టం చేశారు. ప‌హ‌ల్గామ్ ఘ‌ట‌న‌ను కూడా జావేద్ తీవ్రంగా ఖండించారు. ఇటీవ‌ల తాను ఓ పాక్ జ‌ర్నిలిస్టుగా గట్టిగా బ‌దులిచ్చిన‌ట్టు చెప్పారు.

లాహోర్ లో జ‌రిగిన ఓ సినిమా ఫంక్ష‌న్‌కు తాను హాజరయ్యానని అక్కడ ఓ రిపోర్టర్.. భారతీయులంతా పాకిస్థానీలను ఉగ్రవాదులుగా భావిస్తారా అని అడిగారని చెప్పారు. దీంతో తాను..నేను ముంబాయి వాసిని నా నగరంపై అనేకసార్లు దాడులు జరిగాయి. అనేకసార్లు నా నగరం తగలబడటం చూశాను. వారంతా స్వీడన్, ఈజిప్ట్ నుండి వచ్చినవారు కాదు. అంతా పాకిస్థాన్ నుండి వచ్చిన వారే ఇప్పుడు కూడా వాళ్లు పాకిస్థాన్ లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు అని సమాధానం ఇచ్చానని చెప్పారు. తరవాత భారత్ తిరిగి వచ్చానని, అక్కడ నా వ్యాఖ్యలు ఉద్రిక్తతకు దారి తీసినట్టు తెలిసిందని అన్నారు.

Next Story