- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Wrestler Sushil Kumar: హత్య కేసులో రెజ్లర్ సుశీల్ కుమార్ కు ఊరట
హత్యకేసులో అరెస్టయిన భారత స్టార్ రెజ్లర్ (Star Wrestler) సుశీల్ కుమార్ (Sushil Kumar) కు ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) లో ఊరట దక్కింది.

దిశ, నేషనల్ బ్యూరో: హత్యకేసులో అరెస్టయిన భారత స్టార్ రెజ్లర్ (Star Wrestler) సుశీల్ కుమార్ (Sushil Kumar) కు ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) లో ఊరట దక్కింది. జూనియర్ రెజ్లర్ సాగర్ ధన్‌కర్ హత్య కేసులో సుశీల్ కుమార్‌కు రెగ్యులర్ బెయిల్ దక్కింది. రూ.50 వేల బాండ్, ఇద్దరి పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. కాగా.. జూనియర్ రెజ్లర్ సాగర్ ధన్‌కర్ 2021లో హత్యకు గురయ్యాడు. కాగా ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియం వద్ద 2021 మే 4న సాగర్‌తోపాటు అతని స్నేహితులు సోను, అమిత్ కుమార్‌లపై సుశీల్ కుమార్, అతని స్నేహితులు దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సాగర్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో, హత్య కేసులో మొత్తం 18 మంది నిందితులుగా ఉన్నారు. వారిలో సుశీల్ కుమార్ కూడా ఒకరిగా ఉన్నాడు. సుశీల్ కుమార్, అతని స్నేహితులపైన హత్య కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
గతంలోనూ బెయిల్
ఢిల్లీ పోలీసులు 170 పేజీల చార్జిషీట్‌లో సుశీల్ కుమార్ ను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. సాగర్ ఫ్లాట్‌ను ఖాళీ చేయడానికి ఇష్టపడకపోవడం, సుశీల్ కుమార్ సాగర్ కి భయపడుతున్నాడనే వాటిని కూడా ఛార్జిషీట్ లో పేర్కొన్నారు. పశ్చిమ ఢిల్లీలోని ముండ్కా నుండి అరెస్టు కావడానికి ముందు సుశీల్ రెండు వారాలకు పైగా పరారీలో ఉన్నాడు. కాగా.. 2021 మే నెలాఖరుని సుశీల్ ని అదుపులోకి తీసుకోగా.. జూన్ 2, 2021 నుండి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ఇకపోతే, ఇదే కేసులో గతంలో కూడా సుశీల్‌కు బెయిల్ దొరికింది. 2023 మార్చిలో రోహిణి కోర్టు సుశీల్ తండ్రి అంత్యక్రియలు నిర్వహించడానికి మానవతా దృక్పథంతో అతడికి నాలుగు రోజుల బెయిల్ మంజూరు చేసింది. 2023 జూలైలో మోకాలి శస్త్రచికిత్స కోసం ఆయనకు 7 రోజులపాటు మధ్యంతర బెయిల్ లభించింది. కాగా.. మంగళవారం ఢిల్లీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. ఇకపోతే, సుశీల్ కుమార్ ఒలింపిక్స్‌లో భారతదేశానికి రజత, కాంస్య పతకాలు అందించారు.






