- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Plane Crash : టాటా చరిత్రలోనే తీవ్ర విషాదం : టాటా ఛైర్మన్
అహ్మదాబాద్ విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash) టాటాల చరిత్రలోనే తీవ్ర విషాదమని టాటా ఛైర్మన్ చంద్రశేఖరన్(TATA Chairman ChandraShekharan) ఆవేదన వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : అహ్మదాబాద్ విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash) టాటాల చరిత్రలోనే తీవ్ర విషాదమని టాటా ఛైర్మన్ చంద్రశేఖరన్(TATA Chairman ChandraShekharan) ఆవేదన వ్యక్తం చేశారు. కాగా గురువారం అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన కొన్ని సెకన్లలోనే ఎయిర్ ఇండియా బోయింగ్(Air India Boeing) విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ, మెడికల్ కాలేజీ విద్యార్థులతోసహ ఇప్పటి వరకు 269 మంది చనిపోయారు. ప్లేన్ క్రాష్ ఘటనపై నేడు టాటా ఛైర్మన్ చంద్రశేఖరన్ సహచర ఉద్యోగులకు లేఖ రాశారు.
ఈ విషాదం టాటాల చరిత్రలోనే కనీవినీ ట్రాజెడీగా పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తు కోసం భారత్ నుంచే కాకుండా అమెరికా, లండన్ నుంచి దర్యాప్తు బృందాలు వచ్చాయని, వారందరికీ పూర్తిగా సహకరిస్తున్నామని లేఖలో వెల్లడించారు. ప్రయాణీకుల భద్రతే ముఖ్యమని, ఆ విషయంలో రాజీ పడే వ్రసక్తే లేదని చంద్రశేఖరన్ పునరుద్ఘాటించారు.






