- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూడో వరల్డ్ వార్ రావొచ్చు.. డొనాల్డ్ ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోందని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. మూడో వరల్డ్ వార్ రావొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (President Donald Trump) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోందని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. మూడో వరల్డ్ వార్ రావొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (President Donald Trump) అన్నారు. ఇవాళ ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొల్పాలని తాను ప్రయత్నిస్తున్నానని అన్నారు. గత నెల వ్యవధిలో 25వేల మంది సైనికులు చనిపోవడం బాధకరమని ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం విషయంలో యూరప్ (Europe)లోని నాటో మిత్రరాజ్యాలు మరింత బాధ్యత తీసుకోవాలని, లేకపోతే పరిస్థితి అదుపుతప్పి మూడో వరల్డ్ వార్‌కు దారి తీస్తుందని అన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన మాట వినట్లేదని పేర్కొన్నారు.
మరోవైపు ఉక్రెయిన్ (Ukraine)కు ట్రంప్ ప్రభుత్వం 28 పాయింట్ ప్లాన్‌ను ప్రతిపాదించింది. అందులో ఉక్రెయిన్ సైన్యాన్ని సగం తగ్గించాలని, కొన్ని ప్రాంతాలు రష్యాకు అప్పగించాలని పేర్కొన్నారు. దీంతో స్పందించిన ఉక్రెయిన్, రష్యాకు అనుకూలంగా మేలు చేసే కుట్రలు చేస్తోందని ఆరోపించింది.






