- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
India: భారత్ పై మరోసారి దిగజారుడు వ్యాఖ్యలు చేసిన పాక్
పొరుగుదేశంలో రైలు హైజాక్ ఘటన కలకలం రేపింది. అయితే, ఈ ఘటనకు భారత్ (India)ని బాధ్యుల్ని చేస్తూ పాకిస్థాన్ (Pakistan) మరోసారి నోరు జారింది.

దిశ, నేషనల్ బ్యూరో: పొరుగుదేశంలో రైలు హైజాక్ ఘటన కలకలం రేపింది. అయితే, ఈ ఘటనకు భారత్ (India)ని బాధ్యుల్ని చేస్తూ పాకిస్థాన్ (Pakistan) మరోసారి నోరు జారింది. భారత్ పొరుగుదేశాల్లో అస్థిరతకు కృషి చేస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంపై భారత విదేశాంగ శాఖ మండిపడింది. పాక్ చేస్తున్న నిరాధార ఆరోపణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది. ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడుందో ప్రపంచం మొత్తానికి తెలుసని విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ అన్నారు. పాక్ ఇతరులను నిందించే బదులు తమ అంతర్గత సమస్యలపై దృష్టిసారిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు.
భారత్ పై పాక్ విమర్శలు
బలోచిస్థాన్‌లో జరిగిన రైలు హైజాక్ ఘటనపై పాక్ విదేశాంగ అధికార ప్రతినిధి షఫ్‌ఖత్ అలీఖాన్ గురువారం మీడియాతో మాట్లాడుతూ భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. భారత్ తమ దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా.. 425 మంది ప్రయాణికులతో క్వెట్టా నుంచి పెషావర్‌కు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) వేర్పాటువాదులు బోలన్ ప్రాంతంలో మంగళవారం హైజాక్ చేసింది. ఈ ఘటనలో వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లు 33 మందినీ హతమార్చినట్లు పాకిస్థాన్ సైన్యం పేర్కొంది. రైలు హైజాక్ వెనక అఫ్గానిస్థాన్ హస్తం ఉందనేందుకు తమవద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని పాక్ విదేశాంగ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలపై అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ స్పందించింది. పాక్ చేస్తున్న నిరాధార ఆరోపణలను ఖండిస్తున్నట్లు పేర్కొంది. తమ సమస్యలను పరిష్కరించుకోలేని పాక్ ఇతర దేశాలపై నిందలు వేయడం మానుకోవాలని హితవు పలికింది.






