- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ దగ్గుమందును ఇతర దేశాలకు ఎగుమతి చేశారా? భారత్‌ను ఆరా తీసిన డబ్ల్యూహెచ్ఓ
మధ్యప్రదేశ్ లో దగ్గుమందు కారణంగా మరణించిన చిన్నారుల సంఖ్య 20కి పెరిగింది. కోల్డ్ రిఫ్ దగ్గుమందు కారణంగా ఈ స్థాయిలో చిన్నారులు మరణించడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్ లో దగ్గుమందు కారణంగా మరణించిన చిన్నారుల సంఖ్య 20కి పెరిగింది. కోల్డ్ రిఫ్ దగ్గుమందు కారణంగా ఈ స్థాయిలో చిన్నారులు మరణించడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. తాజాగా ఈ ఘటనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పందించింది. ఈ దగ్గుమందును ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేశారా అని ఆరా తీసింది. దీనిపై సంబంధిత అధికారుల నుంచి వివరణ రావలసి ఉందని తెలుస్తోంది. ఆ తర్వాత దగ్గుమందుపై గ్లోబల్ మెడికల్ ప్రొడక్ట్స్ అలర్ట్ ఇవ్వాలా ?వద్దా? అన్నదానిపై అంచనా వేయనున్నట్లు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి.
కోల్డ్ రిఫ్ తాగిన చిన్నారులు మరణించడంతో.. పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు సహా.. పలు భారతీయ రాష్ట్రాలు ఈ దగ్గుమందు అమ్మకాలను నిషేధించాయి. తమిళనాడులోని ఒక ల్యాబ్ లో నిర్వహించిన పరీక్షల్లో.. కోల్డ్ రిఫ్ లో బ్రేక్ ఫ్లూయిడ్లు, యాంటీ ఫ్రీజ్ లలో ఉపయోగించే విషపూరిత లిక్విడ్ 48.6 శాతం డైఇథైలిన్ గ్లైకాల్ ఉందని నిర్థారణ అయింది. దీంతో తయారీదారు అయిన శ్రీసన్ ఫార్మాపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.






