- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MenToo: మగాళ్ల బాధ పట్టదా? సౌరభ్ కోసం రోడ్డెక్కిన దేశం.. నిరసనలో అమ్మాయిలు కూడా..!
JusticeForSaurabh: ఇప్పుడు దేశం మొత్తం సౌరభ్ హత్య కేసు గురించే మాట్లాడుకుంటోంది.

దిశ, వెబ్ డెస్క్: JusticeForSaurabh: ఇప్పుడు దేశం మొత్తం సౌరభ్ హత్య కేసు గురించే మాట్లాడుకుంటోంది. మీరట్ లో భార్య ముస్కాన్ తన ప్రేమికుడు సాహిల్ తో కలిసి భర్త సౌరభ్ ను దారుణంగా హత్య చేసింది. ఈ హత్య సాధారణమైంది కాదు అత్యంత క్రూరత్వంతో జరిగింది. ఆ తర్వాత సౌరభ్ మృతదేహాన్ని ముక్కలుగా నరికి, డ్రమ్ములో వేసి సిమెంట్ కప్పేసారు. అంతేకాదు హత్య చేసిన తర్వాత ఈ మానవమృగాలు హిమాచల్ కు పర్యటనకు వెళ్లి..అక్కడ 11 రోజులు చాలా సరదాగా గడిపారు. ఆ తర్వాత వాళ్లు తిరిగి వచ్చినప్పుడు ఈ భయంకరమైన రహస్యం బయటపడింది. వారిద్దరిని అరెస్టు చేసిన పోలీసులు జైలుకు పంపించారు.
కాగా నిన్న మొన్నటి వరకు ప్రపంచ వ్యాప్తంగా #meetoo ఉద్యమం వేడిని రాజేసింది. లైంగిక దాడుల బాధితులం అంటూ పలు వ్రుత్తుల్లో మహిళలు తమ చుట్టూ ఉన్నవారిపై చేసిన ఆరోపణలు సంచలనంగా నిలిచాయి. మీటు ఉద్యమానికి మీడియా, సోషల్ మీడియా కూడా బాసటగా నిలిచింది. ఈ ఉద్యమం ఎంతో మంది పురుషుల జీవితాలు తలకిందులు అయ్యాయి. ఇండియాలో కూడా ఈ ఉద్యమం సంచలనం రేపింది. అయితే ఇప్పుడు మగాళ్ల జీవితాలు నాశనం అవుతున్నాయంటూ #mentoo అనే పేరుతో మగాళ్లు కూడా బాధితులే అని అంటున్నారు.
తాజాగా సౌరభ్ హత్య ఇప్పుడు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. మీరట్ లో ప్రజలు సౌరభ్ కేసు నిందితులు ముస్కాన్, సాహిల్ కు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ మీరట్ ప్రజలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. #JusticeForSaurabh అనే హ్యాష్ ట్యాగ్ దీపికా నారాయణ్ భరద్వాజ్ ఓ పోస్టును షేర్ చేశారు. చివరకు దేశంలో పురుషుల భద్రత కోసం కూడా ర్యాలీలు చేపట్టాల్సి వచ్చిందన్నారు. ఈ దేశం చివరకు పురుషులపై దారుణాలు ఆపాలని మేల్కుందని నేను అనుకుంటున్నాను అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కాగా ఈ ర్యాలీలో పురుషులే కాదు భారీ ఎత్తున మహిళలు కూడా పాల్గొన్నారు. నిందితులకు ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్ష విధించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
It is so heartening to see that people are now coming out on streets for #MenToo
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) March 27, 2025
A protest organized for #JusticeForSaurabh
I don't know who these women & men are but salute to them 🙏🙏
This country has finally woken up to atrocities on men I think pic.twitter.com/JcTmL7dolp
పురుషుల స్వరాన్ని వినిపిస్తున్నందుకు మీకు కూడా సెల్యూట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ మహిళలు ఒక పురుషుడికి న్యాయం కోసం లేదా అతని పట్ల సానుభూతి చూపించడానికి వీధుల్లోకి వస్తే, దానిని పెద్దగా ప్రశంసించాల్సిన అవసరం లేదు. స్త్రీలకు ఏదైనా తప్పు జరిగినప్పుడు, పురుషులు ఎక్కువగా వీధుల్లోకి వస్తారు. కానీ ఇది చూసి నాకు సంతోషంగా అనిపించిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.






