Viral: ఫోన్లకు అశ్లీల వీడియోలు.. బీజేపీ నాయకుడిని చెప్పులతో కొట్టిన సొంత పార్టీ మహిళలు (వీడియో)

by Prasad Jukanti |   (  Updated:2025-07-17 12:09:02  IST  )

బీజేపీ నాయకుడిని సొంత పార్టీ మహిళలు దేహశుద్ధి చేశారు.

Viral: ఫోన్లకు అశ్లీల వీడియోలు..  బీజేపీ నాయకుడిని చెప్పులతో కొట్టిన సొంత పార్టీ మహిళలు (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహిళా కార్యకర్తలకు అశ్లీల వీడియోలు పంపుతున్న నాయకుడికి మహిళలు దేహశుద్ధి చేశారు. అతటి భార్య ముందే చెప్పులతో కొట్టి బుద్ధి చెప్పారు. ఈ ఘటనల ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రాలో జరిగింది. నిందితుడు ఆనంద్ శర్మ ఖండౌలిలో ఓ మ్యారేజ్ ఫంక్షన్ హాల్ నిర్వహిస్తూనే బీజేపీ బూత్ అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు. అయితే అతడు గత నెల రోజులుగా మహిళా కార్యకర్తల ఫోన్లకు అశ్లీల ఫోటోలు, వీడియోలను పంపుతున్నాడు. అతటి చర్యలకు కంగుతిన్న మహిళా కార్యకర్తలు ఇదేం పని అంటూ హెచ్చరించారు. మళ్లీ రిపీట్ చేయవద్దని సూచించారు. అయినా వెనక్కి తగ్గని ఆనంద్ శర్మ తన బూతు పురాణాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఆయన చర్యలు రోజు రోజుకు శృతిమించి కార్యకర్తలతో పాటు చివరకు ఆఫీస్ బేరర్లకు సైతం అశ్లీల వీడియోలు పంపినట్లు ఆరోపిస్తున్నారు. ఆనంద్ శర్మ చర్యలకు విసిగిపోయిన మహిళా కార్యకర్తలు నిన్న నేరుగా అతడి ఇంటికి వెళ్లారు. కుర్చిలో కూర్చుని ఉన్న ఆనంద్ శర్మను కాలర్ పట్టుకుని చెప్పులతో కొడుతూ వీధిలోకి లాక్కొచ్చారు. జరుగుతున్న పరిణామాన్ని చూసి ఆశ్చర్యపోయిన అతడి భార్య తన భర్తను కొట్టవద్దని వేడుకుంది. అయినా సదరు మహిళలు వదలకుండా ఆనంద్ శర్మకు దేహశుద్ధి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే శర్మ కుటుంబం మహిళల ఆరోపణలను ఖండించింది. ఆయనను కుట్రపూరితంగా ఇందులో ఇరికిస్తున్నారని ఆరోపింపారు. ఈ ఘటనపై బీజేపీ నగర అధ్యక్షుడు రాజ్ కుమార్ గుప్తా స్పందిస్తూ ఆనంద్ శర్మకు బీజేపీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆయన స్వతంత్ర కార్యకర్త అని తెలిపారు. కాగా మధ్యప్రదేశ్ లోని ఓ బీజేపీ లీడర్ తన ప్రియురాలితో శ్మశానం వద్ద కారులో రొమాన్స్ చేస్తూ స్థానికులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరో బీజేపీ నేతపై ఆరోపణలు రావడం సంచలనంగా మారింది.

Next Story