ఎయిరిండియా విమానంలో బిడ్డ డెలివరీ..ముంబై వస్తుండగా..

by Phanindra |

మస్కట్ నుంచి ముంబై వస్తున్న ఎయిరిండియా విమానంలో గర్భిణీకి నొప్పులు మొదలయ్యాయి. ఆమెకు విమానంంలోనే డెలివరీ చేశారు క్రూ.

ఎయిరిండియా విమానంలో బిడ్డ డెలివరీ..ముంబై వస్తుండగా..
X

దిశ, నేషనల్ బ్యూరో: మస్కట్ నుంచి ముంబై వస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో అరుదైన ఘటన జరిగింది. గర్భంతో ఉన్న ఒక థాయ్ ప్రయాణికురాలికి జర్నీ మధ్యలో నొప్పులు మొదలయ్యాయి. ఇలాంటి సందర్భాల్లో ఎలా స్పందించాలో శిక్షణ తీసుకున్న క్రూ.. విమానంలో ఉన్న ఒక నర్సు సాయంతో ఆమెకు డెలివరీ చేశారు.

క్రూకు తాము ఇచ్చిన శిక్షణ ఈ డెలివరీ సమయంలో ఎంతో సహకారం అందించిందని ఎయిర్‌లైన్స్ పేర్కొంది. ఇలా జరగ్గానే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు విషయం చెప్పిన పైలట్లు.. ముంబైలో ప్రయారిటీ ల్యాండింగ్‌కు అనుమతి తీసుకున్నారు. విమానం ల్యాండవగానే అవసరమైన వైద్య సహకారం అందించారని, ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగానే ఉన్నారని, వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారని ఎయిర్‌లైన్స్ తెలిపింది.

Next Story