మహిళలూ.. మిమ్మల్ని రక్షించే ఈ చట్టాల గురించి తెలుసా?

by Yella Dhawani Reddy |

మన దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంత అభివృద్ధి చెందుతున్న మహిళలపై అఘాయిత్యాలు మాత్రం ఆగటం లేదు.

మహిళలూ.. మిమ్మల్ని రక్షించే ఈ చట్టాల గురించి తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: మన దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంత అభివృద్ధి చెందుతున్న మహిళలపై అఘాయిత్యాలు మాత్రం ఆగటం లేదు. గృహహింస, ఈవ్‌టీజింగ్, లైంగిక వేధింపులు, వెకిలి మాటలు-చేష్టలతో ఇంటా-బయటా నేటికీ స్త్రీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే భారత రాజ్యాంగం మహిళలకు వారి రక్షణ, అభ్యున్నతి కోసం అనేక ప్రత్యేక హక్కులను కల్పించింది. వాటి గురించి ప్రతి మహిళ అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరం. మరి అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

* గృహహింస నుంచి మహిళల రక్షణ చట్టం, 2005 (Protection of Women from Domestic Violence Act, 2005):

ఈ చట్టం మహిళలకు జీవిత భాగస్వామి, అత్తమామలు లేదా కుటుంబ సభ్యుల నుంచి శారీరక, మానసిక, లైంగిక లేదా ఆర్థిక వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తుంది.

* వరకట్న నిషేధ చట్టం, 1962 (The Dowry Prohibition Act, 1961):

ఈ చట్ట ప్రకారం వివాహానికి ముందు, వివాహం సమయంలో లేదా వివాహం తర్వాత వరకట్నం డిమాండ్ చేయడం, ఇవ్వడం, తీసుకోవడం నేరం. ఈ తరహా వేధింపులను ఎదుర్కొంటున్న మహిళలు IPC సెక్షన్ 498A కింద కేసు నమోదు చేయవచ్చు.

* అనైతిక వ్యాపారర (నివారణ) చట్టము, 1956 (The Immoral Traffic (Prevention) Act, 1956):

చిన్న పిల్లలను, మహిళలను అక్రమంగా నిర్బంధించటం, విక్రయించటం వంటి చర్యలకు పాల్పడితే ఈ చట్టం ద్వారా వారిని శిక్షించవచ్చు. ఈ చట్టం ప్రకారం నేరానికి పాల్పడిన వారికి ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తారు.

* పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక హింస (నివారణ, నిషేధం- పరిహార) చట్టం, 2013 (The Sexual Harassment of Women at Workplace PREVENTION, PROHIBITION and REDRESSAL Act, 2013):

ఈ చట్టం ప్రకారం.. పని ప్రదేశాల్లో మహిళలకు ప్రత్యేక వాష్‌రూమ్‌ కల్పించాలి. శ్రామిక మహిళలకు భద్రత కల్పించాలి. పని ప్రదేశంలో ఎవరైనా మిమ్మల్ని లైంగికంగా వేధించినా లేదా అసభ్యకర ఫోటోలు తీసిన అసభ్యకరంగా మాట్లాడినా వారిపై ఫిర్యాదు చేయవచ్చు. IPC సెక్షన్ 354A ప్రకారం వారికి శిక్ష పడుతుంది.

* స్త్రీల అసభ్య చిత్రణ (నిషేధ) చట్టం, 1986 (The Indecent Representation of Women (Prohibition) Act, 1986):

స్త్రీలను అసభ్యకరంగా లేదా అభ్యంతరకరంగా చూపించే ఏదైనా ప్రకటనను ప్రచురించడం, ప్రచురించడంలో సహాయపడటం లేదా ప్రదర్శించడంలో పాల్గొనడం వంటివి ఈ చట్టం ప్రకారం నిషేధించవచ్చు.

* ప్రసూతి ప్రయోజన చట్టం, 1961 (Maternity Benefit Act, 1961):

ప్రసూతి ప్రయోజన చట్టం,1961ను- 2017 సవరించారు. దీని ప్రకారం ప్రభుత్వ ,ప్రైవేట్ రంగాలలో పనిచేసే మహిళలు మొదటి ఇద్దరు పిల్లలకు 6 నెలలు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, తరువాతి పిల్లలకు 3 నెలలు సెలవులు పొందవచ్చు. ఈ చట్టం నర్సింగ్ తల్లులకు క్రెచ్‌లు, సౌకర్యవంతమైన పని గంటల కోసం నిబంధనలను కూడా తప్పనిసరి చేస్తుంది.

* చిన్నపిల్లలను లైంగిక వేధింపుల నుంచి రక్షించటానికి (POCSO Act, 2012):

మైనర్లను లైంగిక వేధింపుల నుంచి రక్షించేందుకే POCSO చట్టం రూపొందించబడింది. ఈ నేరానికి పాల్పడిన వారికి జీవిత ఖైదు శిక్ష విధించబడుతుంది. నేరం నిరూపించబడకపోయినా ఐదేళ్ల వరకు బెయిల్ కూడా మంజూరు చేయబడదు.

Next Story