- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Caste Census: మీరు మీ కులం చెప్పుకోవచ్చు కానీ కులగణన వద్దా?.. మహిళా సీఈవోకు నెటిజన్ల కౌంటర్లు
కులగణన వద్దు అంటూ ఓ మహిళా సీఈవో చేసిన పోస్టు వైరల్ గా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో త్వరలో జరగబోయే జనాభా లెక్కల సేకరణతో పాటు కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ నిర్ణయం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారగా మరో వైపు సోషల్ మీడియాలోనూ ఈ టాపిక్ రచ్చగా మారింది. ఈ అంశంపై రకరకాల డిబేట్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో కులగణన వద్దు (SayNoToCasteCensus) అంటూ ఓ మహిళ సీఈవో ప్లకార్డు పట్టుకుని చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. దీంతో ఆమె పోస్టుపై పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అయినే ఆమెను అంతలా ట్రోల్ చేయడానికి గతంలో ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్టులే కారణం.
మీరు మీ కులం చెప్పుకోవచ్చు కానీ కులగణన వద్దా?
అనురాధ తివారి (Anuradha Tiwari) అనే మహిళా బెంగళూరులో జస్ట్ బర్స్ట్ అవుట్ అనే కంటెంట్ రైటింగ్ కంపెనీకి సీఈవోగా పని చేస్తున్నారు. అమె సోషల్ మీడియాలో చేసే పోస్టులు తరచూ కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంటాయి. 'బ్రాహ్మిణ్ జీన్స్' (Brahmin genes), రిజర్వేషన్లు అంశంపై ఆమె చేసే పోస్టులు డిస్కషన్ గా మారుతుంటాయి. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కులగణన నిర్ణయంపై ఆమె స్పందించారు. జనరల్ కేటగిరి వారంతా కచ్చితంగా ఈ కులగణనను ఆత్మగౌరవంతో వ్యతిరేకించాలని గురువారం ఓపోస్టు చేసింది. ఈ రోజు మనం మౌనంగా ఉడకూడదు, మాట్లాడాలి. ఫ్లెక్సీలు పట్టుకుని అభ్యంతరం వ్యక్తం చేయడం ఇది కేవలం నిరసనకు గుర్తు మాత్రమే. అవసరం అయితే వీధుల్లోకి వస్తాం. కులగణనగు వ్యతిరేకంగా ఇవాళ నలుపు రంగు దుస్తువులు ధరించాలి అని పిలుపునిచ్చారు. ఈ పోస్టుపై పలువురు నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. గతంలో అనేక సార్లు బ్రాహ్మిణ్ జీన్స్ పేరుతో మీరు మీ కులం గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ బలహీన వర్గాలకు మేలు జరిగే కులగణన మాత్రం చేయవద్దు. ఇదేనా మీ ద్వంద్వ నీతి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక మరికొందరు ఆమె పిలుపుకు స్పందనగా సే నో క్యాస్ట్ సెన్సస్ అనే ప్లకార్డులు పోస్టు చేస్తున్నారు. దీంతో ఈ కులగణన అంశం సోషల్ మీడియాలో హాట్ హాట్ గా మారిపోయింది.






