విడాకులివ్వాలని వెనక్కి రప్పించి.. 65 ఏళ్ల తల్లిపై అత్యాచారం చేసిన కొడుకు..

by Naga Rani Yarlagadda |

ఆడపిల్లలు, మహిళలపై ప్రతిరోజూ దారుణ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా దేశరాజధాని ఢిల్లీలో మరో అమానుష, జుగుప్సకరమైన ఘటన జరిగింది.

విడాకులివ్వాలని వెనక్కి రప్పించి.. 65 ఏళ్ల తల్లిపై అత్యాచారం చేసిన కొడుకు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆడపిల్లలు, మహిళలపై ప్రతిరోజూ దారుణ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా దేశరాజధాని ఢిల్లీలో మరో అమానుష, జుగుప్సకరమైన ఘటన జరిగింది. 65 ఏళ్ల తల్లిపై 39 ఏళ్ల కొడుకు రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లి విషయాన్ని తన చిన్న కూతురికి చెప్పగా.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయమని సూచించడంతో విషయం వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత మహిళ సౌదీ అరేబియా పర్యటన నుంచి ఆగస్టు 1న తిరిగి వచ్చిన కొద్ది సేపటికే ఆమెపై కొడుకు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఢిల్లీలోని హౌజ్ ఖాజీ ప్రాంతంలో బాధిత మహిళ తన కుటుంబంతో నివసిస్తోంది. భర్త రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. పెద్ద కుమార్తెకు వివాహం అవ్వగా వారికి సమీపంలోనే అత్తమామలతో కలిసి ఉంటోంది. జులై 17న బాధిత మహిళ, ఆమె భర్త, చిన్న కూతురితో కలిసి సౌదీ అరేబియాకు వెళ్లారు.

మతపరమైన వారి పర్యటన పూర్తి కాకుండానే మధ్యలోనే తిరిగి వచ్చేయాలని కొడుకు ఫోన్ చేసి పట్టుబట్టాడు. ఆగస్టు 1న వారంతా ఢిల్లీకి తిరిగి రాగా.. తల్లికి విడాకులు ఇవ్వాలని తండ్రిని ఒత్తిడి చేశాడు. తన బాల్యంలో ఆమెకు అక్రమ సంబంధాలు ఉన్నాయని ఆరోపించి.. తల్లిని ఒక గదిలో బంధించాడు. ఆమె వేసుకున్న బుర్ఖాను బలవంతంగా తీసేసి, శారీరకంగా దాడి చేసి, అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత పెద్దకుమార్తె వద్ద ఆశ్రయం పొందిన మహిళ.. ఆగస్టు 11న తిరిగి ఇంటికి చేరుకుంది. కానీ కొడుకు వేధింపులు మాత్రం ఆగలేదు. ఆ రోజు రాత్రి 9.30 గంటల సమయంలో నిందితుడు తన తల్లితో ఏకాంతంగా మాట్లాడాలనుకుంటున్నట్లు తన కుటుంబ సభ్యులకు చెప్పాడు. గదిలోకి తీసుకెళ్లి.. గతంలో చేసిన తప్పులకు తాను శిక్ష వేస్తానని చెప్పిన కొడుకు.. ఆగస్టు 14 తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో రెండోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత మహిళ ఫిర్యాదుతో భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 64 కింద కేసు నమోదు చేసి.. నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story