- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Myanmar Earthquake: మూడ్రోజుల తర్వాత శిథిలాల కింద సజీవంగా గర్భిణీ
మయన్మార్ భూకంపం (Earthquake) విపత్తులో చనిపోయిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు.

దిశ, నేషనల్ బ్యూరో: మయన్మార్ భూకంపం (Earthquake) విపత్తులో చనిపోయిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. విపత్తు సంభవించిన మూడు రోజుల తర్వాత శిథిలాల కింద సహాయక సిబ్బంది ఓ గర్భిణీని సజీవంగా గుర్తించారు.మాండలేలోని గ్రేట్‌వాల్ హోటల్ శిథిలాల నుంచి ఆమెను బయటకు తీసినట్లు అధికారులు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. మహిళను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు శిథిలాల కింద చిక్కుకుపోయిన తమవారు సజీవంగా ఉండొచ్చనే ఆశతో అనేకమంది తమ చేతులతోనే శిథిలాలను తొలగిస్తున్నారు. ఇప్పటివరకు బయటకు తీసినవారిలో ఒక్క మహిళ తప్ప ఎవరూ ప్రాణాలతో లేరని అధికారులు పేర్కొన్నారు. శిథిలాలను పూర్తిగా తొలగించేందుకు కనీసం రెండు నెలల సమయం పడుతుందని అంటున్నారు.
1700 దాటిన మృతుల సంఖ్య
మయన్మార్, థాయ్‌లాండ్ దేశాల్లో శుక్రవారం రెండు భారీ భూకంపాలు (Earthquake in Myanmar, Thailand) సంభవించాయి. ఈ పెను విపత్తులో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ ప్రకంపనల విధ్వంసానికి రెండు దేశాల్లో కలిపి మృతుల సంఖ్య 1700 దాటింది. ఒక్క మయన్మార్‌లోనే కనీసం 1002 మంది మరణించినట్లు మిలిటరీ అధికారులు వెల్లడిచారు. మరో 2,370 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. మయన్మార్‌లో భూకంపం ప్రభావం పొరుగునున్న థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లోనూ పడింది. అక్కడ భూమి తీవ్రంగా కంపించింది. థాయ్ లాండ్ లో ఈ విపత్తు వల్ల ఆరుగురు చనిపోగా.. 22 మంది చనిపోయారు. 101 మంది గల్లంతయినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా, చైనా సౌత్ వెస్ట్ లోని యూనన్ ప్రావినెన్స్ లోనూ భూమి కంపించింది. ఇకపోతే, ఈ కష్టసమయంలో అక్కడి ప్రజలకు ఆపన్న హస్తం అందించేందుకు భారత్ ఇప్పటికే ముందుకొచ్చింది. ఆపరేషన్ బ్రహ్మ’ కింద దాదాపు 15 టన్నుల సహాయ సామగ్రిని అక్కడికి పంపించింది. అంతే కాకుండా విపత్తులో ఉన్న ఆ దేశానికి సాయం చేసేందుకు 80 మంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని అక్కడికి పంపుతున్నట్లు పేర్కొంది. అమెరికా, ఇండోనేషియా, చైనా, రష్యా సహా ఇతర దేశాలు కూడా అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించాయి.






