- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇలా కూడా చేస్తారా? బుల్లెట్ బైక్ నడపడం రాదని.. భర్తను వదిలేసింది.. ఆపై మూడు పెళ్లిళ్లు!
భర్త అన్నాక ఆ మాత్రం 'బుల్లెట్' బండి నడపడం రాకపోతే ఎలా? అంటూ ఓ ఇల్లాలు అలిగింది. కేవలం బైక్ నడపడం రాదనే సాకుతో కట్టుకున్నవాడిని, కన్నబిడ్డలను వదిలేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: భర్త అన్నాక ఆ మాత్రం 'బుల్లెట్' బండి నడపడం రాకపోతే ఎలా? అంటూ ఓ ఇల్లాలు అలిగింది. కేవలం బైక్ నడపడం రాదనే సాకుతో కట్టుకున్నవాడిని, కన్నబిడ్డలను వదిలేసింది. అక్కడితో ఆగని ఆ 'కిలాడీ' లేడీ.. రెండో పెళ్లి, ఆపై మూడో పెళ్లి చేసుకుంటూ లక్షల్లో దండుకున్నట్లు కేసు నమోదు అయింది. కర్ణాటకలోని దొడ్డబళ్లాపురలో ఈ వింత ఘటన తాజాగా వెలుగు చూసింది.
బైక్ నడపడం రాని భర్త వద్దు!
వివరాల్లోకి వెళితే.. బెంగళూరు రూరల్ జిల్లా, దొడ్డబళ్లాపుర తాలూకా అనబే గ్రామానికి చెందిన సుధారాణి అనే మహిళకు గతంలోనే హీరేగౌడ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, భర్త హీరేగౌడకు బుల్లెట్ బైక్ నడపడం రాదన్నది సుధారాణి ప్రధాన ఫిర్యాదు. ఇదే కారణంతో నిత్యం గొడవపడే ఆమె.. చివరికి బైక్ నడపడం రాని భర్త తనకు వద్దంటూ అతడిని, పిల్లలను వదిలేసి పుట్టింటికి చేరింది. అక్కడితో ఆమె ఆగడాలు ఆగలేదు. తన మొదటి భర్త హీరేగౌడ చనిపోయాడని నమ్మించి అనంతమూర్తి అనే వ్యక్తిని వలలో వేసుకుంది. అతడిని రెండో పెళ్లి చేసుకున్న సుధారాణి.. అతడి నుంచి సుమారు రూ. 20 నుంచి 25 లక్షల వరకు నగదు, బంగారం కాజేసింది.
హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పి.. మూడో పెళ్లి
కొన్నాళ్లు అనంతమూర్తితో కాపురం చేసిన సుధారాణి.. ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్తున్నానని నమ్మబలికింది. కానీ, ఆమె హైదరాబాద్ వెళ్లకుండా బెంగళూరులో శివగౌడ అనే మరో వ్యక్తిని మూడో పెళ్లి చేసుకుంది. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన రెండో భర్త అనంతమూర్తి ఆరా తీయగా అసలు నిజాలు తెలిశాయి. చనిపోయాడని చెప్పిన మొదటి భర్త హీరేగౌడ బతికే ఉన్నాడని, ఉద్యోగం అని చెప్పి వెళ్లిన ఆమె మూడో పెళ్లి చేసుకుందని తెలుసుకుని షాక్ అయ్యాడు. బాధితుడు అనంతమూర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.






