Maha Kumbh: కుంభమేళా నుంచి భర్తకు వీడియో కాల్.. ఆ తర్వాత మహిళ ఏం చేసిందంటే?

by Shamantha N |

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా ముగింపు దశకు చేరింది. ఇప్పటికే ఈ వేడుకకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు.

Maha Kumbh: కుంభమేళా నుంచి భర్తకు వీడియో కాల్.. ఆ తర్వాత మహిళ ఏం చేసిందంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా ముగింపు దశకు చేరింది. ఇప్పటికే ఈ వేడుకకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. అయితే, కుంభమేళాకు హాజరుకాని వారి కోసం పలువురు చేస్తున్న చర్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇటీవలే కొందరు తమ బంధువుల ఫొటోలను త్రివేణి సంగమంలో ముంచగా.. మరికొందరు తమవారి పేర్లు చెబుతూ పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అయితే, ప్రస్తుతం కుంభమేళాలో ఓ మహిళ చేసిన వినూత్న పని వైరల్ గా మారింది. మహా కుంభమేళాకు వెళ్లిన ఓ మహిళ అక్కడి నుంచి తన భర్తకు వీడియో కాల్‌ చేశారు. ఆ తర్వాత ఫోన్‌ను పలుమార్లు నీటిలో ముంచి తీసింది. శిల్ప చౌహాన్ అనే ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ నుంచి షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది.

నెటిజన్ల ఫన్నీ కామెంట్స్

ఫోన్ ను నీటిలో ముంచి తన భర్తకు పవిత్ర సంగమంలో పుణ్యస్నానం చేసిన అనుభవాన్ని ఇచ్చేందుకు మహిళ చేసిన ప్రయత్నంపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. మీ భర్తకు దుస్తులు మార్చుకొని, జుట్టు ఆరబెట్టుకోమని చెప్పు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. కుంభమేళాలో ఆన్ లైన్ స్నానం చేసి పాపాలనుంచి విముక్తి పొందాడని మరొకరు అన్నారు. ఇంకొకరేమో.. మీ వల్ల ఇన్ స్టాగ్రామ్ పవిత్రస్నానం చేసిందని చెప్పుకొచ్చారు. మరోవైపు, మహాకుంభమేళా జనవరి 13న ప్రారంభం కాగా.. ఫిబ్రవరి 26వరకు కొనసాగనుంది. కాగా.. త్రివేణి సంగమంలో దాదాపు 45 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని యూపీ సర్కారు అంచనా వేయగా.. ఇప్పటికి 63 కోట్ల మంది గంగాస్నానాలు ఆచరించారు.

Next Story