పునర్జన్మ ఇచ్చిన డాక్టర్..30 నిమిషాల పాటు CPR చేసి మ‌రీ !

by velandi.Saikiran |   (  Updated:2026-02-16 20:30:47  IST  )

ఆస్ప‌త్రిలో ఉన్న ఓ మ‌హిళ‌కు 30 నిమిషాల పాటు సీపీఆర్ చేసి కాపాడింది ఓ లేడీ డాక్ట‌ర్‌

Woman doctor performed CPR for nearly 30 minutes
X

Woman doctor performed CPR for nearly 30 minutes

దిశ‌, వెబ్ డెస్క్‌: దేశంలో రకరకాల సంఘటనలు జరుగుతున్నాయి. ఏదో ఒక మూలన ఏదైన‌ అరుదైన సంఘటన జరిగి వైరల్ గా మారుతోంది. సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, దేశంలో ఎక్కడ ఏం జరిగినా ఇట్టే వైరల్ అవుతోంది. సోషల్ మీడియా ఓపెన్ చేయగానే ఆ వీడియో మనకు దర్శనం ఇస్తోంది. అలా వైర‌ల్ అయిన సంఘ‌ట‌న‌లు చాలానే ఉన్నాయి. ఇందులో కొన్ని ఫ‌న్నీ స‌న్ని వేశాలు ఉంటే, మ‌రికొన్ని సంఘ‌ట‌నలు మాత్రం వేరేలా ఉంటాయి. అయితే తాజాగా ఓ రోగిని మహిళ వైద్యురాలు కాపాడిన సంఘటన హాట్ టాపిక్ అయింది. జరిగింది ఎక్కడో తెలియదు కానీ ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

రోగికి 30 నిమిషాల పాటు సీపీఆర్ చేసిన లేడీ డాక్టర్ !

డాక్టర్ అంటేనే దేవుడు. ఒక మనిషి ప్రాణాలతో ఎలాంటి రోగాలు లేకుండా బతకాలంటే ఖచ్చితంగా డాక్టర్ సలహా సూచనలు అవసరం. అందుకే అతన్ని దేవుడిలా ఆరాధిస్తారు జనాలు. అయితే లేటెస్ట్ గా ఓ లేడీ డాక్టర్ చేసిన పని ఇంకా అంద‌రూ ప్రశంసించేలా చేసింది. ఓ ప్రముఖ ఆసుపత్రిలో ఓ లేడీని అడ్మిట్ చేశారు. అయితే ఆమె హార్ట్ బీట్ పైన డౌట్ వచ్చిన వెంటనే అలర్ట్ అయింది అక్కడే ఉన్నా స‌ద‌రు లేడీ డాక్టర్. దీంతో ఆసుపత్రి బెడ్ పైన ఉన్న ఆ మహిళకు సీపీఆర్ చేసింది ఆ లేడీ డాక్టర్. దాదాపు 30 నిమిషాల పాటు సీపీఆర్ చేసినట్లు చెబుతున్నారు. 30 నిమిషాల పాటు కార్డియో పల్సనరీ రిససిటేషన్ చేయడంతో ఆ రోగి బతికి బయటపడినట్లు చెబుతున్నారు. ఈ అరుదైన సంఘటనకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఇది చూసిన జనాలు షాక్ అవుతున్నారు. 30 నిమిషాలు సీపీఆర్ చేయడమేంటని కొంత మంది ప్రశ్నిస్తుంటే.. మరి కొంత మంది ఆ లేడీ డాక్టర్ ను మెచ్చుకుంటున్నారు. సమయానికి ఆ లేడీ డాక్టర్ వచ్చింది కాబట్టి ఎలాంటి ప్రమాదం జరగలేదని మరి కొంతమంది అంటున్నారు. వైద్యులు ఎప్పుడు కూడా భగవంతుడితోనే సమానమని పోస్టులు పెడుతున్నారు.

అసలు సీపీఆర్ ఎందుకు చేయాలి ?

చాలా మంది సీపీఆర్ అనే పేరు ఇప్పటికే అంద‌రూ వినే ఉంటారు. ఈ మధ్యకాలంలో దీని గురించి వీడియోలు కూడా బాగానే వైరల్ అవుతున్నాయి. సీపీఆర్ ఫుల్ ఫామ్.. కార్డియో పల్సనరీ రిససిటేషన్. ఇది మనిషి గుండె ఆగినప్పుడు చేసే ప్రక్రియ. మనిషి గుండె ఆగిపోయినప్పుడు వెంటనే అలర్టై అయి, సీపీఆర్ చేయాలట. అలా చేసినప్పుడు మెదడుతో పాటు ఇతర అవయవాలకు రక్తప్రసరణ అందుతుంది. సరైన సమయంలో ఈ సీపీఆర్ చేస్తే నిండు ప్రాణాలను కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పైన పేర్కొన్న లేడీ డాక్టర్ కూడా అదే పని చేసింది. సమయస్ఫూర్తితో స్పందించిన ఆ లేడీ డాక్టర్... ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది. 30 నిమిషాల పాటు సీపీఆర్ చేసిందంటే ఆమె గుండె ధైర్యం ఎంత పెద్దదో అని అంటున్నారు.

Next Story