- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
15 రోజుల బాలింత మృతి.. పుట్టింటి వారికి చెప్పకుండానే దహన సంస్కారాలు.. ఏం జరిగింది?
పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. 15 రోజుల తర్వాత అనుమానాస్పద స్థితిలో మరణించింది.

దిశ, వెబ్‌డెస్క్: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. 15 రోజుల తర్వాత అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆ విషయాన్ని పుట్టింటి వారికి చెప్పకుండానే దహన సంస్కారాలు చేయడంతో అత్తమామలపై అనుమానాలు రేకెత్తాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ లోని ధాంపూర్ పోలీస్ స్టేషన్లో ఓ మహిళ.. తన పాతికేళ్ల కుమార్తెను భర్త, అత్తమామలు హతమార్చారని ఆరోపిస్తూ కంప్లైంట్ ఇచ్చింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం రూబీ చౌహాన్ కు గజ్రౌలా గ్రామానికి చెందిన ముకుల్ కు ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది.
ముకుల్ తరచూ మద్యం సేవించి తనను శారీరకంగా వేధించేవాడని రూబీ పలుమార్లు తల్లికి మొరపెట్టుకుంది. ఈ క్రమంలో రూబీ గర్భవతి అయి 15 రోజుల క్రితం ఆడపిల్లకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి తనకు అత్తమామల నుంచి వేధింపులు మరింత పెరుగుతున్నాయని చెప్పిందని తల్లి ఫిర్యాదులో పేర్కొంది. అనూహ్యంగా రూబీ మరణించడం, తమకు తెలియకుండానే దహనం చేయడం వెనుక ఏదో కుట్ర ఉందని, భర్త, అత్తమామలే ఆమెను హతమార్చారని అనుమానం వ్యక్తం చేసింది. దీంతో రూబీని దహనం చేసిన ప్రాంతం నుంచి ఫోరెన్సిక్ బృందం కొన్ని శాంపిల్స్ ను సేకరించింది. ముకుల్, అతని తల్లిని అరెస్ట్ చేసి, విచారిస్తున్నామని సర్కిల్ ఆఫీసర్ అభయ్ కుమార్ పాండే తెలిపారు.






