Trump Tariffs: టారిఫ్ లతో అమెరికన్లకే భారం! ఎస్‌బీఐ రీసెర్చ్‌ తాజా నివేదిక

by Prasad Jukanti |

ట్రంఫ్ టారిఫ్ లపై ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక విడుదల చేసింది.

Trump Tariffs: టారిఫ్ లతో అమెరికన్లకే భారం! ఎస్‌బీఐ రీసెర్చ్‌ తాజా నివేదిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) భారత్ పై విధించిన 25 శాతం సుంకాలు (Tariff) ఆపై పడనున్న జరిమానాలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. మనదేశం నుంచి అమెరికా దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపై 25 శాతం పన్నులు వేస్తున్నట్లు ప్రకటించంతో ఈ చర్యల వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది మార్గెట్ వర్గాల్లో సర్వత్రా ఆసక్తిగా మారింది. అయితే ట్రంప్ తీసుకున్న ఈ ప్రతీకార సుంకాల చర్యల ఆయన సొంత దేశ ప్రజలకే గుదిబండగా మారనున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ టారిఫ్ లతో అమెరికా కుటుంబాలపైనే భారడం పడనుందని తాజాగా ఎస్ బీఐ రీసెర్చ్ (SIB Research) వెల్లడించింది. ఎస్ బీఐ చేపట్టిన తాజా రీసెర్చ్ రిపోర్టు వెల్లడించింది. ద్రవ్యోల్బణం కారణంగా ఏటా అదనంగా 2400 డాలర్ల భారం అమెరికన్లపై ఉండనుందని ఈ నివేదిక స్పష్టం చేసింది.

బ్యాడ్ బిజినెస్ మూవ్:

అమెరికా టారిఫ్ నిర్ణయం ఒక చెడు వ్యాపార చర్యగా ఎస్ బీఐ రీసెర్చ్ అభివర్ణించింది. ఈ నివేదిక ప్రకారం దాదాపు అన్ని దిగుమతులను ప్రభావింత చేసే సుంకాల కారణంగా యూఎస్ వినియోగదారుల ధరలు స్వల్పకాలంలో 2.4 శాతం, దీర్ఘకాలంలో 1.2 శాతం పెరగవచ్చని అంచనా వేసింది. ఎస్ బీఐ అంచనా ప్రకారం సగటు అమెరికన్ కుటుంబానికి వార్షికంగా 2400 డాలర్లు, అధిక ఆదాయ కుటుంబాలకు 5000 వేల డాలర్లు, తక్కువ ఆదాయం ఉన్న వారి కుటుంబాలకు దాదాపు మూడు రెట్లు ధరల పెరుగుతాయని తెలిపింది. ట్రంప్ చర్యలతో భారత దేశ డీజీపీ 2026 ఆర్థిక సంవత్సరంలో 25- 30 బేసిస్ పాయింట్లను మాత్రమే కోల్పోనుందని అచనా వేసింది.

Next Story