- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెంగళూరు ట్రాఫిక్ కోసం విప్రో క్యాంపస్ గేట్లు తెరవడం కుదరదు: అజీమ్ ప్రేమ్‌జీ
బెంగళూరు ట్రాఫిక్ సమస్యకు ఊరట కోసం విప్రో క్యాంపస్ రోడ్లు తెరవడం కుదరదని అజిమ్ ప్రేమ్‌జీ తేల్చిచెప్పారు. దీర్ఘకాలిక పరిష్కారం కోసం కలిసి పనిచేద్దామన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: బెంగళూరు ట్రాఫిక్ సమస్యను కొంత వరకైనా తగ్గించేందుకు విప్రో క్యాంపస్ నుంచి వాహనాలు వెళ్లేందుకు అనుమతివ్వాలని ఆ కంపెనీ వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీకి సీఎం సిద్ధరామయ్య లేఖ రాశారు. అయితే ఈ విన్నపాన్ని ప్రేమ్‌జీ తిరస్కరించారు. ఈ అంశంలో ఎన్నో చట్టపరమై, ప్రభుత్వ పరమైన సవాళ్లున్నాయని ఆయన చెప్పారు. అలాగే తమ సర్జాపూర్ క్యాంపస్ ఒక ప్రైవేట్ ప్రాపర్టీ అని, అలాగే అంతర్జాతీయ క్లయింట్లకు సేవలందిస్తున్న సెజ్‌లో భాగమని వివరించారు. ఇప్పటికే చేసుకున్న కాంట్రాక్టుల వల్ల కఠినమైన యాక్సెస్ కంట్రోల్ నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే తమ క్యాంపస్‌ను పబ్లిక్ కోసం తెరిచినా.. బెంగళూరు ట్రాఫిక్ సమస్యకు లాంగ్ టర్మ్ పరిష్కారం లభించదని ప్రేమ్‌జీ అభిప్రాయపడ్డారు. ఈ సమస్యకు డేటా ఆధారిత పరిష్కారం కనుక్కోవడానికి కర్ణాటక ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.






