ఒక్కసారిగా విమానాన్ని కుదిపేసిన గాలులు.. అత్యవసర ల్యాండింగ్

by Yella Dhawani Reddy |

ఇటీవల కాలంలో విమాన ప్రయాణం (Flight Journey) అంటేనే ప్రయాణికులు భయపడే పరిస్థితులు నెలకొంటున్నాయి.

ఒక్కసారిగా విమానాన్ని కుదిపేసిన గాలులు.. అత్యవసర ల్యాండింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో విమాన ప్రయాణం (Flight Journey) అంటేనే ప్రయాణికులు భయపడే పరిస్థితులు నెలకొంటున్నాయి. వరుసగా నమోదవుతున్న సాంకేతిక లోపాలు, అత్యవసర ల్యాండింగ్‌లు విమాన ప్రయాణంపై నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. ప్రయాణికుల్లో ఆందోళనలు పెరుగుతున్న తరుణంలో తాజాగా మరో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళ్లితే.. బుధవారం రాత్రి సాల్ట్‌లేక్ సిటీ నుంచి ఆమ్‌స్టర్‌డామ్‌కు ( Salt Lake City to Amsterdam) వెళ్తున్న డెల్టా ఎయిర్‌లైన్స్‌ ఫ్లైట్‌ (Delta Air Lines flight) (DL 56) మినియాపొలిస్‌ సమీపంలో తీవ్రమైన గాలుల తాకిడికి గురైంది. తీవ్ర కుదుపులు రావడంతో పైలట్లు అప్రమత్తంగా స్పందించి విమానాన్ని మినియాపొలిస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఘటన సమయంలో విమానంలో 275 మంది ప్రయాణికులు, 13 మంది సిబ్బంది ఉన్నారు. గాలుల ప్రభావంతో 25 మందికి పైగా గాయపడ్డారు. మినియాపొలిస్ ఎమర్జెన్సీ సిబ్బంది వెంటనే స్పందించి గాయపడినవారికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. పైలట్లు చొరవతో పెను ప్రమాదం తప్పినట్లుగా తెలుస్తోంది.

Next Story