డీలిమిటేషన్‍పై వ్యూహం రెడీ.. ఇండియా కూటమి నేతల భేటీ అనంతరం ఖర్గే హాట్ కామెంట్స్

by Prasad Jukanti |

మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలుపుతూనే, డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తామని ఖర్గే ప్రకటించారు. ఇండియా కూటమి భేటీలో రేపటి వ్యూహం ఖరారు చేశారు.

డీలిమిటేషన్‍పై వ్యూహం రెడీ.. ఇండియా కూటమి నేతల భేటీ అనంతరం ఖర్గే హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లు నేపథ్యంలో రేపు పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశం కాబోతున్న నేపథ్యంలో ఢిల్లీలోని ఖర్గే నివాసంలో ఇండియా కూటమి (INDIA Alliance) నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఇండియా కూటమిలోని వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. రేపు సభలో అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఖర్గే.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తామంతా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నామని కానీ డిలిమిటేషన్ పేరుతో చేస్తున్న ట్రిక్కులకు వ్యతిరేకం అన్నారు. మహిళా రిజర్వేషన్ అంటూ దొంగదారిలో డీలిమిటేషన్ అమలు చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. డీలిమిటేన్ బిల్లు అమలును వ్యతిరేకిస్తామన్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే బిల్లులో సవరణలు చేస్తున్నారని మండిపడ్డారు.

Next Story