- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pakistan: దాడి చేస్తే.. అణ్వాయుధాలు సహా పూర్తి శక్తి వాడుతాం.. పాక్ ప్రేలాపనలు
పహెల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పాక్ పై భారత్ కఠిన చర్యలు తీసుకుంటుంది. కాగా.. హెచ్చరికలను భారత్ ఏమాత్రం పట్టించుకోకపోవడంతో పాక్ కవ్వింపు చర్యలను ఆపట్లేదు.

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పాక్ పై భారత్ కఠిన చర్యలు తీసుకుంటుంది. కాగా.. హెచ్చరికలను భారత్ ఏమాత్రం పట్టించుకోకపోవడంతో పాక్ కవ్వింపు చర్యలను ఆపట్లేదు. ఇప్పుడు, రష్యాలోని పాక్ దౌత్యవేత్త మహమ్మద్ ఖలీద్ జమాలీ మరోసారి న్యూక్లియర్ వెపన్స్ ని చూపించి భారత్ ని బెదిరించే యత్నం చేశారు. ఒక వేళ న్యూఢిల్లీ తమపై దాడి చేస్తే.. అణ్వాయుధాలు సహా పూర్తి శక్తిని వినియోగిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు రష్యా ఛానల్ ఆర్‌టీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘పాక్ భూభాగంపై భారతదేశం సైనిక దాడులను ప్లాన్ చేస్తోందని ఇస్లామాబాద్‌కు విశ్వసనీయ నిఘా సమాచారం ఉంది. ఇటీవల లీకైనట్లు చెబుతున్న పత్రాల్లో భారత్ కొన్ని చోట్ల కచ్చితంగా దాడులు చేయబోతున్నట్లు తెలిసింది. ఆ దేశంతో యుద్ధం విషయానికి వస్తే.. మేం సంఖ్యాబలం అనే మాయలో పడం. ప్రజల మద్దతుతో మా సంప్రదాయ, అణు బలంతో పూర్తిస్థాయిలో స్పందిస్తాం’’ అని జమాలీ పేర్కొన్నారు.
పహెల్గాం ఉగ్రదాడి
ఏప్రిల్ 22న మధ్యాహ్నం జమ్ముకశ్మీర్‌లోని పర్యాటక ప్రాంతమైన పహెల్గాం (Pahalgam)లో ఉగ్రవాదులు అమాయకులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. కాగా.. కాల్పులకు తెగబడ్డ టెర్రరిస్టులు పాక్ జాతీయులని తేలింది. వారిలో ఒకరిని ఆ దేశ మాజీ పారా కమాండోగా గుర్తించారు. దీంతో, భారతప్రభుత్వం పాక్ పై ప్రతీకార చర్యలకు దిగింది. వీసాలు రద్దు, సింధు జలాల ఒప్పందం నిలిపివేత, ఔషధాల ఎగుమతి, పాకిస్థాన్ నటుల సినిమాలు బ్యాన్ చేసింది. అంతేకాకుండా, ఇతర కఠిన ఆంక్షలు విధించారు. దీనిపైనే పాక్ ప్రముఖులు భారత్ పై అక్కసు వెళ్లగక్కుతున్నారు.






