KC Venugopal: మేం ప్రశాంతంగా నిద్రపోతాం.. వారికే కష్టతరం కానుంది- మోడీ విమర్శలపై కాంగ్రెస్ కౌంటర్

by Shamantha N |

‘మేం ప్రశాంతంగా నిద్రపోతాం. నిద్రపోవడం ప్రధాని మోడీకి కష్టతరం కానుంది.’ అని కాంగ్రెస్ సీనియర్ నేత వేణుగోపాల్‌ చెప్పారు. విజినజమ్ ఇంటర్నేషనల్ సీ పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతిపక్షాలకు నిద్రాభంగం అవుతుందన్న వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.

KC Venugopal: మేం ప్రశాంతంగా నిద్రపోతాం.. వారికే కష్టతరం కానుంది- మోడీ విమర్శలపై కాంగ్రెస్ కౌంటర్
X

దిశ, నేషనల్ బ్యూరో: ‘మేం ప్రశాంతంగా నిద్రపోతాం. నిద్రపోవడం ప్రధాని మోడీకి కష్టతరం కానుంది.’ అని కాంగ్రెస్ సీనియర్ నేత వేణుగోపాల్‌ చెప్పారు. విజినజమ్ ఇంటర్నేషనల్ సీ పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతిపక్షాలకు నిద్రాభంగం అవుతుందన్న వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు పెట్టారు. “ పహెల్గామ్‌లో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడి తర్వాత కూడా మన ప్రధానమంత్రి నిజమైన ముప్పు అయిన పాకిస్థాన్‌ను ఎదుర్కోవడానికి బదులుగా ప్రతిపక్ష నాయకుల నిద్రను భంగం చేయడంపైనే దృష్టి సారించారు. ఆయన ప్రాధాన్యతలు స్పష్టంగా ఉన్నాయి. అవే, తన మిత్రుడు అదానీని శాంతింపజేయడం. కానీ నిశ్చింతగా ఉండండి. ఏ ఉద్దేశంతో మీరు చాలా మందికి నిద్ర ఉండదని అన్నారో నాకు తెలియదు. కానీ నిద్రలేని రాత్రులు గడిపే వాళ్లలో పీఎం కూడా ఒకరు. అందులో ఇండియా బ్లాక్‌ గానీ, రాహుల్‌గాంధీ గానీ, కాంగ్రెస్‌ పార్టీ గానీ ఉండదు” అని కేసీ వేణుగోపాల్ రాసుకొచ్చారు.

కులగణన అమలు చేయాలని..

కులగణన అమలు, రిజర్వేషన్‌లపై 50 శాతం పరిమితి తొలగింపు కోసం తాము కేంద్రంపై తీవ్ర ఒత్తిడి పెంచుతామని కేసీ వేణుగోపాల్ అన్నారు. పాకిస్థాన్ పై నిర్మయాత్మక ప్రతిస్పందనను అందించాలని మీపై నిరంతరం ఒత్తిడితెస్తాం అని చెప్పుకొచ్చారు. కాగా.. కేరళలో ఇంటర్నేషనల్ సీ పోర్టు (International Seaport) ప్రారంభోత్సవం కార్యక్రమానికి సందర్భంగా మోడీతో పాటు శశిథరూర్ హాజరయ్యారు. మోడీ మాట్లాడుతూ.. ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ (Congress party) పై తీవ్ర రాజకీయ విమర్శలు చేశారు. చాలా మందికి నిద్ర లేకుండా చేస్తానని హెచ్చరించారు. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ ధీటుగా స్పందించింది. నిద్రలేని రాత్రులు ఇండియా బ్లాక్‌ (India Bloc) నాయకులకు కాదని, ప్రధాని నరేంద్ర మోడీకేనని కాంగ్రెస్‌ పార్టీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్‌ (KC Vinugopal) అన్నారు.

Next Story