భార్య వేరే వ్యక్తిని ప్రేమించడం అక్రమ సంబంధం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-02-15 07:08:03  IST  )

వివాహేతర సంబంధాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

భార్య వేరే వ్యక్తిని ప్రేమించడం అక్రమ సంబంధం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు
X

దిశ, వెబ్ డెస్క్: వివాహేతర సంబంధాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భర్త కాకుండా, మరో వ్యక్తితో భార్య శారీరక సంబంధం పెట్టుకోకుండా ప్రేమ, అనురాగం ఉంటే దానిని అక్రమ సంబంధంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఓ వ్యక్తి వేసిన పిటిషన్ మేరకు ఈ విధంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

భార్యతో వేరుగా ఉంటూ ఆమెకు భరణం అందజేస్తున్న మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య మరో వ్యక్తిని ప్రేమిస్తుందని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. ఈ కారణం చేత ఆమెకు భరణం పొందే హక్కు లేదని కోర్టులో వాదించాడు. అయితే, భావోద్వేగ ప్రమేయం వివాహేతర సంబంధం కిందకు రాదని కోర్టు అతడి పిటిషన్‌ని కొట్టివేసింది. అక్రమ సంబంధానికి లైంగిక సంపర్కం తప్పనిసరి అని తీర్పునిచ్చింది. దీంతో కుటుంబ కోర్టు ఆదేశాన్ని సవాల్ చేస్తూ అతడు హైకోర్టును ఆశ్రయించాడు.

ఇక ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. భారతీయ నాగరిక్ సురక్ష సంహితలోని (BNSS) సెక్షన్ 144(5), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌‌లోని (CrPC) సెక్షన్‌లను 125(4) ప్రస్తావిస్తూ భార్యకు అక్రమ సంబంధం ఉందని రుజువైతే ఆమెకు భరణం నిరాకరించబడుతుందని చెప్పింది. అయితే, శారీరక సంబంధానికి సంబంధించిన ఆధారాలు లేకుండా ఆమెకు ఎఫైర్ ఉందనే ఆరోపణలను నిలబడవని కోర్టు తేల్చి చెప్పింది. ఎలాంటి శారీరక సంబంధం లేకుండా ప్రేమించడాన్ని తప్పుగా పరిగణించలేమని చెప్పింది. భర్తతో విడిగా ఉంటున్న ఆమెకు చట్ట ప్రకారం భరణం నెలకు రూ.4000 ఇవ్వాల్సిందేనని స్పష్టం చేస్తూ భర్త పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.

Next Story