Viral News: అక్షయ్ కుమార్‌లా కనిపించే ప్రియుడి కోసం.. భర్తను బలి చేసిన భార్య అరెస్ట్

by Ramesh Naini |

ప్రియుడితో కలిసి భర్తను చంపిన తర్వాత భార్య చేసిన హంగామా చూసి అందరూ కంగుతిన్నారు.

Viral News: అక్షయ్ కుమార్‌లా కనిపించే ప్రియుడి కోసం.. భర్తను బలి చేసిన భార్య అరెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Viral News) ప్రియుడితో కలిసి భర్తను చంపిన తర్వాత భార్య చేసిన హంగామా చూసి అందరూ కంగుతిన్నారు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం (Sultanpur) సుల్తాన్‌పూర్‌లోని కిండిపూర్ గ్రామానికి చెందిన 38 ఏళ్ల మహేశ్‌, అతని భార్య పూజ (Pooja), ఇద్దరు పిల్లలతో కలిసి జీవించేవాడు. ఏడాది క్రితం భార్య ఆదే గ్రామనికి చెందిన వివాహితుడు జయప్రకాశ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త.. భార్యతో గొడవలకు దిగేవాడు. దీంతో ప్రియుడితో కలిసి జీవించాలని భార్య పూజ ప్లాన్ చేసింది. అందులో భాగంగా మహేశ్‌ను అడ్డు తొలగించాలని నిర్ణయించారు.

భర్త శవాన్ని చూసిన భార్య పూజ విలపించింది..

సెప్టెంబర్ 3న రాత్రి, జయప్రకాశ్ (Jayaprakash) మహేశ్‌ను తనతో తీసుకెళ్లి మద్యం తాగించాడు. అతని మత్తు ఎక్కిన తర్వాత.. జయప్రకాశ్ పూజకు ఫోన్ చేయగా, ఇద్దరూ మహేశ్‌పై దాడి చేశారు. పదునైన కత్తితో మహేశ్ గొంతు కోయగా.. పూజ అతని ఛాతీపై రాయితో కొటింది. మరుసటి ఉదయం అతని శవం గ్రామం బయట కనిపించింది. భర్త శవాన్ని ఇంటికి తీసుకురాగా.. అది చూసిన భార్య పూజ విలపించింది. ఇక, మహేశ్ హత్య విషయంపై సుల్తాన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. మొదట పోలీసులు భార్యను విచారించారు. భర్త మహేశ్ తన భార్యతో, ఈ రోజు చికెన్ తినాలని ఉందని, చికెన్ కొనడానికి మార్కెట్‌కి వెళ్తానని చెప్పినట్లు పూజ పోలీసులకు తెలిపింది. భార్య రాత్రంతా ఎదురు చూసింది కానీ మహేశ్ తిరిగి రాలేదు. మరుసటి ఉదయం భర్త శవాన్ని చూసినట్లు భార్య వివరించింది.

అక్రమ సంబంధానికి అడ్డుగా మారిన మహేశ్‌..

దర్యాప్తులో పోలీసులు నిందితుడు జయప్రకాశ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. కానీ అసలు హత్యకు కారణమైన మాస్టర్‌మైండ్ మహేశ్ భార్య అని విచారణలో తేలింది. చికెన్ విషయం మొత్తం అబద్ధాలేనని పోలీసులు తెలుసుకున్నారు. భార్యకు జయప్రకాశ్‌తో అక్రమ సంబంధం ఉందని బయటపడింది. నిందితుడు జయప్రకాశ్‌ రూపం నటుడు అక్షయ్ కుమార్‌లా ఉంటుందని పూజ చెప్పినట్లు తెలుస్తోంది. వారి అక్రమ సంబంధానికి అడ్డుగా మారిన మహేశ్‌ను తొలగించాలని నిర్ణయించుకున్నట్లు మరోసారి పోలీసులు విచారణలో తేలింది. ఈ మేరకు భార్యను ప్రియుడిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనకు ఉపయోగించిన కత్తి, మొబైల్ ఫోన్, టార్చ్ లైట్ స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ట్వీట్ లింక్..

Next Story