- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజకీయ పోరాటాలు మీకేందుకు? ఈడీపై సుప్రీంకోర్టు సీరియస్
ఈడీపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ పోరాటం చేయడం అధికార దుర్వినియోగం కిందకు వస్తుందని మండిపడింది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) అక్రమ స్థలాల కేటాయింపు కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య బిఎం పార్వతి, రాష్ట్ర మంత్రి సురేశ్ లపై జారీ చేసిన సమన్లను కర్ణాటక హైకోర్టు కోట్టివేయడాన్ని సవాల్ చేస్తూ ఈడీ సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించింది. ఈ పిటిషన్ అప్పీల్ ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు ఇవాళ నిరాకరించింది. ఈకేసు విచారణకు వచ్చిన వెంటనే సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె. వినోద్ చంద్రన్ లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించానికి అయిష్టత వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా దర్యాప్తు ఏజెన్సీపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈడీని రాజకీయ పోరాటాలకు ఎందుకు ఉపయోగిస్తున్నారని ప్రశ్నించింది. రాజకీయ యుద్ధాలను ఓటర్ల ముందు జరగనివ్వాలని సోలిసిటర్ జనరల్ ఎస్వీ రాజుతో సీజేఐ అన్నారు.






