లద్దాఖ్‌పై చర్చంటే వెనుకడుగు ఎందుకు.. కేంద్రానికి రాహుల్ గాంధీ సూటి ప్రశ్న

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-03 09:04:02  IST  )

పొరుగు దేశం చైనాతో సరిహద్దు వివాదంపై రాహుల్ గాంధీ మరోసారి లోక్‌సభ (Lok Sabha)లో గళమెత్తారు.

లద్దాఖ్‌పై చర్చంటే వెనుకడుగు ఎందుకు.. కేంద్రానికి రాహుల్ గాంధీ సూటి ప్రశ్న
X

దిశ, వెబ్‌డెస్క్: పొరుగు దేశం చైనాతో సరిహద్దు వివాదంపై రాహుల్ గాంధీ మరోసారి లోక్‌సభ (Lok Sabha)లో గళమెత్తారు. ఈ సందర్భంగా ఇవాళ ఆయన మాట్లాడుతూ.. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ నరవణే రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ (Four Stars of Destiny) అనే పుస్తకంలోని అంశాలను సభలో మరోసారి ప్రస్తావించారు. నిన్న సభలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పీకర్‌కు తెలిపారు. తాను మాట్లాడుతున్నది స్వప్రయోజనాల కోసం కాదని, దేశ భద్రత గురించేనని రాహుల్ అన్నారు.

దీంతో రాహుల్ వ్యాఖ్యలపై ఎన్డీఏ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లద్దాఖ్‌లో మన సైనికులు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. కానీ, లద్దాఖ్‌పై చర్చించేందుకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం సీట్ల నుంచి లేచిన కేంద్ర మంత్రులు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు పక్షాల వ్యతిరేక నినాదాలతో లోక్‌సభ దద్దరిల్లింది. ఈ క్రమంలోనే సభలో రాహుల్ గాంధీని మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని విపక్ష సభ్యులు స్పీకర్‌పైకి పేపర్లను చించి విసిరేశారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేశారు.

Next Story