- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒమన్ ను మాత్రం వదిలేసిన ఇరాన్...9 లక్షల మంది భారతీయులు సేఫ్!
ఒమన్ ను మాత్రం వదిలేసింది ఇరాన్. దీంతో 9 లక్షల మంది భారతీయులు సేఫ్ జోన్ లోకి వెళ్లారు.

దిశ, వెబ్ న్యూస్: అమెరికా-ఇజ్రాయెల్ చేసిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటోంది ఇరాన్. ఇందులో భాగంగానే గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసి ఎటాక్ చేస్తోంది. సౌదీ అరేబియా, దుబాయ్ లాంటి దేశాలలో ఇప్పటికే క్షీపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్ పై ప్రతీకార దాడుల్లో భాగంగా గల్ఫ్ దేశాల పైన విరుచుకుపడుతున్న ఇరాన్, ఒకే ఒక గల్ఫ్ దేశాన్ని మాత్రం వదిలేసింది. అదే ఒమన్. దీనికి ప్రత్యేక కారణం ఉంది. దౌత్యంలో అమెరికా, ఇరాన్ లకు ఒమన్ సమాన ప్రాధాన్యం ఇవ్వడం ఒకటే కారణం.
9 లక్షల మంది భారతీయులు సేఫ్
గతంలో పలు సందర్భాలలో ఇరు దేశాలకు ఒమన్ మధ్యవర్తిగా పని చేసింది. దీంతో పాటు ఒమెన్ లో అమెరికా స్థావరం లేదు. మరోవైపు బహ్రెయిన్ , ఖతార్, కువైట్, యూఏఈ, సౌదీ అరేబియా లాంటి దేశాలు అమెరికాకు మద్దతు ఇస్తున్నాయి. ఒమన్ మాత్రం ఇండియా లాగా ఎవరికి సపోర్ట్ చేయకుండా సమాన దూరాన్ని పాటిస్తోంది. ఇది ఇలా ఉండగా ఒమన్ లో దాదాపు 9 లక్షల మంది భారతీయులు ఉన్నారు. ఇప్పుడు ఇరాన్ దాడి చేయకపోవడంతో ఈ జనాభా మొత్తం సేఫ్ జోన్ లోకి వెళ్ళింది. కానీ మిగిలిన దేశాల్లో ఉన్న భారతీయులు మాత్రం వణికిపోతున్నారు.






