MUDA Case: రాజకీయాలకు ఈడీని ఎందుకు ఉపయోగిస్తున్నారు?: ముడా స్కామ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు

by S Gopi |   (  Updated:2025-07-21 09:43:30  IST  )

దీన్ని నిరాకరిస్తూ చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

MUDA Case: రాజకీయాలకు ఈడీని ఎందుకు ఉపయోగిస్తున్నారు?: ముడా స్కామ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతిపై దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. బీఎం పార్వతీకి సమన్లు జారీ చేయడంపై రాష్ట్ర హైకోర్టు క్వాష్ చేయడాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దీన్ని నిరాకరిస్తూ చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి అంశాలను రాజకీయ సాధనంగా ఉపయోగించుకోవడాన్ని ఆపాలని ఈడీకి సూచించింది. అలాంటివేమైనా ఉంటే కోర్టు బయట చూసుకోవాలని, ఇందులో ఈడీని ఎందుకు ఉపయోగిస్తున్నారని ప్రశ్నించింది. 'దురదృష్టవశాత్తు, నాకు మహారాష్ట్రలో కొంత అనుభవం ఉంది. ఆ విషయాలు మాట్లాడాల్సి వస్తే, ఈడీకి సంబంధించిన కీలక విషయాలు చెప్పాల్సి ఉంటుంది. దాన్ని మీరిప్పుడు దేశవ్యాప్తంగా కొనసాగించవద్దని, రాజకీయ పోరాటం ఎన్నికల్లోనే చేసుకోనివ్వండి, ఈడీని ఎందుకు వాడుతున్నారని' ధర్మాసనం ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి లోపాలు లేవని స్పష్టం చేసింది.

కాగా, కర్ణాటకలోని మైసూరులో ఉన్న కెసరె గ్రామంలో బీఎం పార్వతికి 3 ఎకరాల భూమి ఉండేది. ఆమె సోదరుడి నుంచి ఆమెకు బహుమతిగా దాన్ని అందుకున్నారు. కానీ, అభివృద్ధి పనుల కింద ముడా ఆ భూమిని స్థాదీనం చేసుకుంది. ఇందుగ్గానూ 2021లో పరిహారం రూపంలో విజయనగర పాంతంలో 38,283 చ.ద. అడుగుల ప్లాట్లను అందించింది. అయితే, కెసరె గ్రామంలో కంటే విజయనగర ప్రాంతంలో భూమి ధరలు అత్యధికం కావడమే ఈ వ్యవహారంలో వివాదంగా మారింది. విమర్శలు పెరిగిన నేపథ్యంలో ఆమె సదరు భూమిని వెనక్కి ఇచ్చేశారు. దీనికి సంబంధించే పార్వతీకి ఈడీ నోటీసులు ఇవ్వగా, హైకోర్టు సింగిల్ బెంచ్ క్వాష్ చేశారు. దీని గురించి ఈడీ సుప్రీంకోర్టుకు వెళ్లగా తాజా నిర్ణయాన్ని ప్రకటించింది.

Read More..

సిద్దరామయ్యకు సుప్రీంలో భారీ ఊరట..

Next Story