బాంబ్ బ్లాస్టింగ్‌కు హై సెక్యూరిటీ జోనే ఎందుకు? డాక్టర్ ఉమర్ ఆ 3 గంటలు ఏం చేశాడు?

by Naga Rani Yarlagadda |

ఢిల్లీ ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన బాంబ్ బ్లాస్టింగ్ వెనుక ఉగ్రమూకల హస్తం ఉన్నట్లు..

బాంబ్ బ్లాస్టింగ్‌కు హై సెక్యూరిటీ జోనే ఎందుకు? డాక్టర్ ఉమర్ ఆ 3 గంటలు ఏం చేశాడు?
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన బాంబ్ బ్లాస్టింగ్ వెనుక ఉగ్రమూకల హస్తం ఉన్నట్లు ఢిల్లీ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ బ్లాస్టింగ్ వెనుక ఉగ్రసంస్థలతో పరిచయం ఉన్న డాక్టర్లు హస్తం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. బాంబ్ బ్లాస్ట్ ఘటనపై NIA దర్యాప్తు ప్రారంభించగా.. మరిన్ని సీసీటీవీ ఫుటేజీలు బయటికొచ్చాయి. బ్లాస్ట్ అయిన కారు.. బ్లాస్టింగ్ కు 3 గంటల ముందుగానే హై సెక్యూరిటీ జోన్ కు చేరుకున్నట్లు ఆ ఫుటేజీలో గుర్తించారు. ఆ కారులో ఉన్న వ్యక్తిని డాక్టర్ ఉమర్ గా నిర్థారించారు.

అయితే డాక్టర్ ఉమర్ ఆత్మాహుతి దాడికి పాల్పడటానికి మూడు గంటలు ఏం చేశాడన్న విషయం దర్యాప్తులో అత్యంత కీలకంగా మారింది. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 3.19 గంటలకు కారు ఎర్రకోట పార్కింగ్ ప్లేస్ కు రాగా.. సాయంత్రం 6.22 గంటల వరకూ అక్కడే ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే మూడు గంటల్లో కారులో నుంచి ఒక్కరు కూడా కిందికి దిగలేదని సమాచారం. మరి ఆ మూడు గంటలు డాక్టర్ ఉమర్ ఏం చేశాడు? వేరే ఎవరినైనా కలిశాడా? లేక వాహనంలోనే ఉండిపోయాడా? బ్లాస్టింగ్ కు రద్దీగా ఉండే టైమ్ కోసం అంతసేపు వెయిట్ చేశాడా? అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఎర్రకోట హై సెక్యూరిటీ జోన్ ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? అనే ప్రశ్నలు తలెత్తాయి. వీటన్నింటికీ సమాధానాలు వస్తేనే.. అసలు ఈ బ్లాస్టింగ్ వెనుక ఉన్న కీలక సూత్రధారి ఎవరు? ఏ ఉగ్రవాద సంస్థ ఈ దారుణానికి పాల్పడింది? జూనియర్ డాక్టర్లను స్లీపర్ సెల్స్ రంగంలోకి దించాయా? అన్న విషయాలపై స్పష్టత వస్తుందని దర్యాప్తు సంస్థలు తెలిపాయి.

Next Story