- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గెలిచేదెవరు? మెజార్టీ ఎంత? ఐదు రాష్ట్రాల ఫలితాలపై జోరుగా బెట్టింగ్స్
తెల్లారితే ఐదు రాష్ట్రాల ఎసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. విజయం ఎవరిని వరించబోతోంది అన్న దానిపై నరాలు తెగె ఉత్కంఠ కొనసాగుతోంది. ఇదే అదునుగా కోట్లాది రూపాయల బెట్టింగ్ దందా సాగుతోందని తెలుస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు కౌంట్ డౌన్ షురూ అయింది. మరికొన్ని గంటల్లో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. దేశరాజకీయాల్లో హై వోల్టేజ్ క్రియేట్ చేసిన ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి పట్టం కట్టారు మరెవరిని దూరం పెట్టారు అనేది తెల్లవారితే తేలిపోనుంది. ఫలితాలపై రాజకీయ పార్టీల మధ్య ఎవరి ధీమా వ్యక్తం చేస్తున్నా ఎగ్జిట్ పోల్స్ తమ అంచనాలు వెలువరిచినా అంతిమంగా గెలుపు ఎవరిదనేది ఉత్కంఠ రేపుతోంది. దీంతో గెలుపు జోరుగా బెట్టింగ్‍లు సాగుతున్నాయి.
కోట్లాది రూపాయల బెట్టింగ్:
మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం కేరళలో యూటీఎఫ్, అస్సాం, పుదుచ్చేరిలో ఎన్డీయే హావా ఉండబోతోందని అంచనా వేశాయి. కానీ బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పశ్చిమబెంగాల్ లో మెజారిటీ సంస్థలు ఎన్డీయేకే ఎడ్జ్ ఇచ్చినా ప్రముఖ యాక్సిస్ మై ఇండియా సర్వే సంస్థ మాత్రం ఇక్కడ తమ అంచనాలను చెప్పలేదు. ఇక తమిళనాడులో మిగతా సంస్థలు డీఎంకే వైపు మొగ్గు చూపగా యాక్సిస్ మై ఇండియా మాత్రం టీవీకేకు ఎడ్జ్ ఇచ్చింది. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ మరింత సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నాయి. దీంతో ఈ పరిణామం బెట్టింగ్ నిర్వాహకులకు కాసుల వర్షం కురిపిస్తోంది. గెలుపు ఎవరిదనే అంశంతో పాటు మెజార్టీ ఎంత? అనేదాని చుట్టూ కోట్లాది రూపాయల ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. సొంత రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల నుంచి రాజకీయ వ్యాపార వేత్తలు బెట్టింగ్ లో పాల్గొంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
డీఎంకేపై 87, బీజేపీపై 51 శాతం మంది:
ముఖ్యంగా తమిళనాడులో డీఎంకే విజయంపై 87 శాతం మంది బెట్టింగ్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక బెంగాల్ లో 5 మిలియన్ డాలర్లకు పైగా బెట్టింగ్ నడుస్తోందని, ఇక్కడ బీజేపీ గెలుస్తందని 51 శాతం మంది, టీఎంసీ గెలుస్తుందని 49 శాతం మంది బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. నగదుతో పాటు క్రిప్టో, డిజిటల్ కరెన్సీ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు టాక్ వినినపిస్తోంది. మరి ఈ బెట్టింగ్ బారిన పడి ఎంత మంది చేతులు కాల్చుకుంటారో.






