- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తర్వాత ఉప రాష్ట్రపతి ఎవరు? రేసులో ప్రధానంగా ఆ ముగ్గురి పేర్లు!
ఉప రాష్ట్రపతి పదవికి అనూహ్యంగా జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhad) రాజీనామా చేయడంతో, దేశ రాజకీయాల్లో ఉత్కంఠ పెరిగింది.

దిశ, వెబ్ డెస్క్: ఉప రాష్ట్రపతి పదవికి అనూహ్యంగా జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhad) రాజీనామా చేయడంతో, దేశ రాజకీయాల్లో ఉత్కంఠ పెరిగింది. ఈ పదవికి ఎవరు ఎంపిక అవుతారన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముగ్గురు ప్రముఖ నేతల పేర్లు తెరపైకి రావడం ఈ రేసును మరింత ఆసక్తికరంగా మారింది. ఇందులో ముఖ్యంగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బిహార్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రానికి కొన్నేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నీతీశ్ కుమార్ (Nitish Kumar) ఇకనైనా ఆ కుర్చీని వీడి కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని ఎన్డీయే కూటమిలో పలువురు భావిస్తున్నారు. దీంతో పాటు జేడీయూ పార్టీ ఎన్డీయేతో కలిసి ఎన్నికలకు వెళ్లబోతోందన్న ప్రచారం కూడా నడుస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ, ఉప రాష్ట్రపతి పదవిని నితీశ్‌కు ఆఫర్ చేసి, బిహార్ పాలన బాధ్యతలను ఇతర నేతకు అప్పగించాలనే వ్యూహంతో ముందుకు సాగుతోందన్న ప్రచారం ఉంది. జగదీప్ ధన్‌ఖడ్‌ను బలవంతంగా రాజీనామా చేయించిందన్న విమర్శలు కూడా ఈ నేపథ్యంలో ముదురుతున్నాయి.
ఇక, నీతీశ్‌తో పాటు మరో ఇద్దరి పేర్లు కూడా ఉప రాష్ట్రపతి పదవి రేసులో బలంగా వినిపిస్తోన్నాయి. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా. ఇద్దరూ కూడా ప్రధాని మోడీకి అత్యంత నమ్మకస్తులుగా ఉన్నారు. అలాగే, వీరిద్దరికీ పరిపాలనలో మంచి అనుభవం ఉంది. ఈ క్రమంలో రాష్ట్రపతి భవన్‌లో కేంద్రానికి అనుకూలంగా వ్యవహరించగల నాయకులుగా వీరి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అయితే, వీరిలో ఎవరు ఎంపిక అవుతారన్న దానిపై అధికార బీజేపీ లోపలే చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. రాజకీయంగా సమతుల్యత, భవిష్యత్తు రాజకీయ వ్యూహాల మేరకు తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.






