కరోనా కేసుల్లో 10.7 శాతం ఎన్‌బీ.1.8.1 కేసులే: డబ్ల్యూహెచ్‌వో

by Phanindra |

కరోనా కేసుల్లో 10.7 శాతం ఎన్‌బీ.1.8.1 కేసులేనని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. కరోనా పాజిటివిటీ రేటు కూడా 11 శాతానికి చేరిందని వెల్లడించింది.

కరోనా కేసుల్లో 10.7 శాతం ఎన్‌బీ.1.8.1 కేసులే: డబ్ల్యూహెచ్‌వో
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచ వ్యాప్తంగా కరోనా టెస్ట్ పాజిటివిటీ రేటు 11 శాతానికి చేరిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. 2024 జులై తర్వాత పాజిటివిటీ టెస్టింగ్ రేటు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నుంచి కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే వేగంగా వ్యాప్తిచెందిన ఎల్పీ.8.1 వేరియంట్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది.


కానీ ఇటీవలి కాలంలో వేగంగా వ్యాపిస్తున్న ఎన్‌బీ.1.8.1 వేరియంట్‌పై ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనా పాజిటివ్ కేసుల్లో ఎన్‌బీ.1.8.1 కేసులే 10.7 శాతం ఉన్నాయని ప్రకటించింది. కరోనా మేనేజ్‌మెంట్‌పై దేశాలు దృష్టిపెట్టాలని, డబ్ల్యూహెచ్‌వో విడుదల చేసిన సూచనలు అమలుచేయాలని సూచించింది.

Next Story